ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. వేగంగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సినేషన్ ను వేగవంతం చేశారు. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నో రకాల వ్యాక్సిన్ల అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పనితీరుపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత మొదలైంది. దీనికి కారణం హాంకాంగ్ శాస్త్రవేత్తలు అందించిన సర్వే అని చెప్పవచ్చు. చైనాకు చెందిన సీనోఫామ్ సంస్థ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి చేసింది. కోట్లాది మంది ఈ వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. […]
ఈమధ్యకాలంలో అచ్చం సినిమా ఫక్కీలో దొంగతనాలు జరుగుతున్నాయి. అవే కాదు స్కూళ్ళలోని స్ట్రాంగ్ రూంలో ఎగ్జామ్ పేపర్స్ మాయం అవుతున్నాయి. బీరువా తాళాలు పగులగొట్టి మరీ పరీక్షా పత్రాలు దోచేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో జరిగిన ఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా పరిషత్ పాఠశాల లో నిన్న రాత్రి పాఠశాల ఆఫీస్ లోపలికి ప్రవేశించారు దొంగలు. అక్కడే వున్నబీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న త్రైమాసిక పరీక్ష పేపర్లను దొంగిలించారు […]
సూర్యుడు, భూమి మద్య కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ఉన్నప్పటికీ సూర్యుడి నుంచి వెలువడే కాంతి, వేడి భూమిని చేరుతుంటాయి. సమ్మర్ వచ్చింది అంటే వేడిని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటాం. అంతటి వేడున్న సూర్యుని వద్దకు చేరుకోవాలంటే అయ్యేపనేనా… అంటే కాదని చెప్తాం. అసాధ్యాన్ని నాసా సుసాధ్యం చేసి చూపించింది. కొన్ని నెలల క్రితం నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఏప్రిల్ 28 వతేదీన సోలార్ కరోనాలోకి […]
ఉత్కంఠ వీడిపోయింది. తిరుపతిలో బహిరంగసభకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభ అనుమతిపై హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరుపు వాదనలు వినిపించారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. పిటిషనర్ల తరుపు వాదనలు వినిపించారు న్యాయవాది లక్ష్మీనారాయణ. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తిరుపతి బహిరంగ సభకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. మహా పాదయాత్ర ముగింపు […]
గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు. […]
21వ శతాబ్దంలో దెయ్యాలు ఉన్నాయనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. నిత్యం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా ఉన్నాయని నమ్మాల్సి వస్తుంది. అలాంటి సంఘటన ఒకటి ఇటీవలే యూకేలోని విల్డ్షైర్లో ఉన్న లాంగ్ ఆర్మ్ బార్లో జరిగింది. ఓ కస్టమర్ కౌంటర్ దగ్గర నిలబడి డ్రింక్ చేస్తూ బార్ సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఇంతలో కౌంటర్ డెస్క్‌లోని ఓ గ్లాస్ దానంతట అదే కిందపడి పగిలిపోయింది. మిగతా గ్లాసులన్నీ అలానే ఉన్నాయి. […]
తెలంగాణలో మావోయిస్టులు అస్థిత్వం కోసం పోరాడుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులు కలకలం సృష్టించారు. చర్ల మండలంలోని బత్తినపల్లి, ఎర్రంపాడు ప్రాంతాల మధ్య మందు పాతరను పేల్చారు. ఘటనలో గ్రేహౌండ్స్ఆర్ఎస్ఐ గాయపడ్డారు. పోస్టర్లు, వాహనాల విధ్వంసంతో మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు మావోయిస్టులు తమ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటే.. రాష్ట్ర పోలీసులు కూంబింగ్‌లతో వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ములుగు, భద్రాద్రి జిల్లాల్లో సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ కొనసాగుతూనే వుంది. […]
అమెరికా మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమయింది. విశ్వం పుట్టుక రహస్యాన్ని కనుగొనేందుకు కీలక ప్రయోగం చేయబోతున్నది. డిసెంబర్ 22 వ తేదీన ఫ్రెంచ్ గయానాలోని ఏరియల్ స్పైస్ 5 రాకెట్ ద్వారా జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీ సహకారంతో సాసా ఈ టెలిస్కోప్‌ను తయారు చేసింది. సుమారు 25 ఏళ్లపాటు 10 వేల మంది శాస్త్రవేత్తలు నాలుగు కోట్ల పనిదినాలు పనిచేసి, ఈ టెలిస్కోప్‌ను తయారు చేశారు. […]
తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కేసులపై స్పందించారు. ఒమిక్రాన్ కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు నగర పోలీస్ కమిషనర్. ఇతర దేశాల నుండి వచ్చేవారు టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే బయటకి రావాలన్నారు. ఒమిక్రాన్ గురించి భయపడాల్సింది లేదు. ఒమిక్రాన్ వచ్చిన వారికి గచ్చిబౌలి లోని టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తారన్నారు. బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు, వారితో కాంటాక్ట్ అయిన […]
నగరి ఎమ్మెల్యే రోజా స్వపక్షం వారితోనే పోరాడుతుంటారు. తనను ఓడించడానికి అసమ్మతి నేతలు కుట్రపన్నారని గతంలో కన్నీరుపెట్టుకున్నారు. జగన్ కి కంప్లైంట్ చేశారు. తాజాగా రెబల్స్ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తన ఎదుగుదలను ఆపడానికి ఐదుగు మండల వైసీపీ రెబెల్స్ నాయకులను వెనక నుండి రెచ్చగొట్టి నా పై ఆరోపణలు ఎవరు చేయిస్తున్నారో ఆధారాలతో సహా తన వద్ద ఉందన్నారు రోజా. వారి చిట్టాను జగన్ సమక్షంలో ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని రోజా అన్నారు. […]