స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రికార్డు చెక్కు చెదరలేదు. 98 శాతం ఓట్లతో గెలిచిన ఎమ్మెల్సీ గా పోచంపల్లి అప్పట్లో చరిత్ర సృష్టించారు. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కు 2019 జూన్ 3 న ఉప ఎన్నిక జరిగింది. మొత్తం ఓటర్లు 902 మంది ఉండగా 883 మంది ఓటు వేశారు. 848 ఓట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి పడ్డాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు […]
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ని బుధవారం రాజ్‌భవన్‌లో ఆయన నివాసంలో పరామర్శించనున్నారు సీఎం జగన్. ఇటీవల కోవిడ్ నుండి కోలుకున్నారు గవర్నర్ దంపతులు. సతీసమేతంగా గవర్నర్ దంపతులను పరామర్శించనున్నారు సీఎం జగన్. కరోనా తర్వాత ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ దంపతులు బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ గత గురువారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స తీసుకున్నారు. […]
తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామన్నారు వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్దం చేయాలని ఆదేశించారు. ప్రపంచ వ్యాప్త కరోనా పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సౌకర్యం సిద్దం చేయాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలి, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని హరీష్ రావు సూచించారు. కరోనా తాజా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. […]
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, సెబాస్టియన్ మడోన్నాలు హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేశారు. శ్యామ్ సింగరాయ్‌గా నాని ఒదిగిపోయి నటించారు. రెండు పాత్రలు దేనికదే డిఫరెంట్ షేడ్స్ అని చెప్పాలి. Read: మనోహరమైన ఈ టీ […]
ఉదయం లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయే వరకు మనజీవితంలో ఒక్కక్కటి ఒక్కోవిధంగా భాగమై ఉంటుంది. కొంతమంది ఉదయం లేచిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. చాలా మంది లేచిన వెంటనే టీ తాగుతుంటారు. టీ అంటే మనకు గుర్తుకు వచ్చేది అస్సాం. అస్సాంలో టీ తోటలు అధికం. అక్కడ నాణ్యమైన తేయాకును పండిస్తుంటారు. అస్సాంలో దొరికిన్ని వెరైటీలు మరెక్కడా దొరకవు. కిలో తేయాకు రూ. 100 నుంచి వేల రూపాయల వరకు ఉంటుంది. […]
జనంలో అత్యాశ ఉన్నంత వరకూ మోసం చేసే వాళ్ళు ఉంటారని ఇద్దరు నకిలీ బంగారం దొంగలు మరోసారి నిరూపించారు. బంగారం మీద ఉన్న మోజు ఉన్న వరంగల్ వాసులను మోసం చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్న అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు వరంగల్ పోలీసులు. వారిని కటకటాల వెనుకకు నెట్టారు. పోలీసుల వెనుక నిలబడ్డ ఈ ఇద్దరు కేడీలు కర్ణాటక రాష్ట్రం శ్రీరంగపట్టణంకి చెందిన మోహన్‌లాల్. సోలంకి ధర్మ. వీళ్ళేం మామూలు వ్యక్తులేం కాదు. జనానికి బంగారంపై […]
ఇండియన్ బిజినెస్ మెన్ ఆదానీకి అనేక రకాల వ్యాపారాలు ఉన్న సంగతి తెలిసిందే. అదానీ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఆదానీ రియల్ గ్రూప్ బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఓజోన్ రియల్ ఎస్టేట్ ను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అదానీ గ్రూప్ ఓజోన్ గ్రూప్ తో చర్చలు జరుపుతున్నది. ఈ డీల్ విలువ బిలియన్ డాలర్లు ఉండే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఓజోన్ గ్రూప్‌పై దాదాపు […]
టీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పెద్దల సభకు నామినేటెడ్ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనా చారి ఎన్నికయినట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి పేరును కేబినెట్ ఆమోదించి.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి పంపించారు. ఆమె ఆమోదించడంతో ఎమ్మెల్సీగా ఎన్నికయినట్టు గెజిట్ విడుదల చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసినందుకు మధుసూదనాచారి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు. వారు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. […]
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రితో ఓ అరుదైన సర్జరీ జరిగింది. కాలిన గాయాలతో బాధపడుతున్న నవీన్ అనే యువకుడికి హోమో గ్రాఫ్ట్ సర్జరీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి ఉస్మానియాలో స్కిన్ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. చనిపోయినవారి స్కిన్ తీసుకొని 45 రోజులపాటు ప్రాసెస్ చేసిన తరువాత హోమోగ్రాఫ్ట్ చేస్తారు. కాలిన గాయాలపై స్కిన్‌తో సర్జరీ చేస్తారు. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో స్కిన్ బ్యాంక్ కోసం ఇద్దరి నుంచి చర్మాన్ని సేకరించినట్టు వైద్యులు తెలిపారు. ఉస్మానియాలో చేసిన […]