NTV WebDesk
Author- NTV Telugu-
దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1,059 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,30,814 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉన్నట్లు కేంద్ర […] -
ఉద్యోగ సంఘాలతో చర్చలపై మంత్రి నాని ఆశాభావం
ఏపీలో సీఎం జగన్ తో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. పీఆర్సీ అంశాలు, ఉద్యోగుల నిరసనలపై చర్చించనుంది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నా అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు పేర్ని నాని. అనేక అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాం.ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని […] -
ఎన్టీవీ షార్ట్ న్యూస్
ముచ్చింతల్‌లో నాలుగోరోజు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు కీలక ఘట్టాలు జరగనున్నాయి. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. నేడు రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలు క్రతువుల్లో స్వల్ప మార్పులు చేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న […] -
కరోనా మహమ్మారికి 5 లక్షలమంది బలి
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు నమోదయ్యాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. గత 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. […] -
కాసేపట్లో సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ
ఏపీలో కాక రేపుతున్న పీఆర్సీ అంశంపై ఒక నిర్ణయానికి రానుంది ప్రభుత్వం. సీఎం జగన్ తో మంత్రుల కమిటీ భేటీ కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో పది గంటలకు ముఖ్యమంత్రితో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. నిన్న స్టీరింగ్ కమిటీ లో జరిగిన చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి వివరించనుంది మంత్రుల కమిటీ. హెచ్ఆర్ఏ, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శ్లాబులు, సీసీఏ రద్దు, మట్టి ఖర్చులు అంశాలపై ఖజానా పై పడే ఆర్ధికభారం, ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను […] -
షేక్‌పేట్ ఫ్లైఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర ప్రమాదం
రోడ్డు ప్రమాదాలు మామూలైపోయాయి. ఇటీవల ప్రారంభం అయిన షేక్ పేట నూతన ఫ్లైఓవర్ నెత్తురోడింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్ కొత్త బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన కారు ఫ్లై ఓవర్ పై వెళుతున్న బైక్‌ను ఢీ కొంది. దీంతో ఫ్లై ఓవర్ పై నుంచి బైక్ తో సహా కింద పడ్డాడు ఆ యువకుడు. దీంతో బ్రిడ్జి పై బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి వంతెనపై నుండి పడిపోయాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి […] -
చలితో వణుకుతున్న తెలంగాణ .. ఆదిలాబాద్ లో అత్యల్పం
తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. రెండ్రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో రానున్న మూడ్రోజుల పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బిహార్ నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భల మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో […] -
తిరుమలకు పెరుగుతున్న భక్తులు.. 8న రథసప్తమికి ఏర్పాట్లు
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ. […] -
బీజేపీ తొలితరం నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి ఇక లేరు
బీజేపీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. వరంగల్ జిల్లాలో చందుపట్ల జంగారెడ్డి 18 నవంబర్ 1935 న జన్మించారు. ప్రస్తుతం హన్మకొండలో నివాసం వుంటున్నారు. సుదేష్మాను 1953లో వివాహం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ […] -
పీఆర్సీ అంశంపై మంత్రుల కమిటీ భేటీ .. చర్చలు ఫలించేనా?
ఏపీలో హాట్ టాపిక్ గా మారింది పీఆర్సీ అంశం. దీనిపై మంత్రుల కమిటీ భేటీ అయింది. పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసిందన్నారు సలహాదారు సజ్జల. ఉద్యోగ సంఘాల అనుమానాలు నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశాం. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సజ్జల. చాలా అంశాల్లో ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయని భావిస్తున్నాం అన్నారు. మళ్ళీ కలిసి పనీ చేస్తాం అన్న […]
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!