ఏపీలో సీఎం జగన్ తో సమావేశం కానుంది మంత్రుల కమిటీ. పీఆర్సీ అంశాలు, ఉద్యోగుల నిరసనలపై చర్చించనుంది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకి సంతృప్తినిచ్చే విధంగానే ఉంటాయని భావిస్తున్నా అన్నారు.
ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశిస్తున్నా అన్నారు పేర్ని నాని. అనేక అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాం.ఆర్థికపరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని మధ్యాహ్నాం ఉద్యోగులతో భేటీ అవుతాం.పీఆర్సీ పంచాయతీ ఇంత వరకు రావడం వెనుక సీఎస్సునో.. అధికారులనో తప్పు పట్టలేం.
ప్రభుత్వం అన్నాక సమిష్టి బాధ్యత.మంచైనా.. చెడైనా ప్రభుత్వానిదే సమిష్టి నిర్ణయం.షరతులతో చర్చలు జరగవు.. సమస్య పరిష్కారం కాదన్నారు మంత్రి పేర్నినాని. ఇదిలా వుంటే తిరుపతి చంద్రగిరిలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్, యాప్ డౌన్ చేస్తున్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని సహాయ నిరాకరణ ప్రారంభించారు ఉద్యోగులు. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఉప ఖజానా, ఇరిగేషన్ కార్యాలయాల్లో నిలిచిపోయాయి. ఎలాంటి ఫైల్స్ ముట్టుకోకుండా నిరసన తెలుపుతున్నారు ఉద్యోగులు. అసలు కార్యాలయాలకే రాలేదు కొందరు ఉద్యోగులు