itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- itel ACE 4 Shine ఫీచర్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్..
- కేవలం రూ.1,059 మాత్రమే..
- 1.77 అంగుళాల QQVGA కలర్ డిస్ప్లే
- 1,000mAh బ్యాటరీ, USB Type-C ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
itel ACE 4 Shine: బడ్జెట్ ధరలో ఫీచర్ ఫోన్‌ను కావాలనుకునే వినియోగదారుల కోసం.. ఐటెల్ నుండి ఐటెల్ ఏస్ 4 షైన్ (itel ACE 4 Shine)ను భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. బడ్జెట్ ధర విభాగంలో వచ్చిన ఈ డ్యూయల్ సిమ్ ఫోన్.. సెకండరీ మొబైల్గా, సీనియర్ సిటిజన్లకు, తొలిసారి మొబైల్ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉండేలా రూపొందించారు. ముఖ్యంగా ఈ ఫోన్లో USB టైపు-C ఛార్జింగ్ పోర్ట్‌ను అందించడం ప్రత్యేకతగా చెప్పొచ్చు.
డిజైన్, డిస్ప్లే
ఈ మొబైల్ లో కర్వ్డ్ బాడీ, టెక్స్చర్డ్ ఫినిష్‌తో వస్తుంది. మెరుగైన గ్రిప్, మన్నికను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఇందులో 1.77 అంగుళాల QQVGA కలర్ డిస్ప్లే ఉంటుంది. ఇది 128×160 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. బ్యాక్లిట్ ‘రేడియంట్ కీప్యాడ్’, పెద్ద అక్షరాలతో డయలర్ ఉండటంతో నంబర్లు, మెనూలను సులభంగా చూడొచ్చు. ఈ ఫోన్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
1,000mAh బ్యాటరీ
itel ACE 4 షైన్ లో 1,000mAh బ్యాటరీ ఉంది. నెట్వర్క్ పరిస్థితులు, వినియోగాన్ని బట్టి ఇది 8 రోజుల వరకు స్టాండ్‌బై, 8.3 గంటల వరకు టాక్‌టైమ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ధర విభాగంలోని ఫీచర్ ఫోన్లలో అరుదుగా కనిపించే USB Type-C ఛార్జింగ్ పోర్ట్‌ను ఇందులో అందించారు. దీంతో పాత మైక్రో-USB కేబుల్స్ అవసరం ఉండదు. అలాగే వృద్ధులు, యాక్సెసిబిలిటీ అవసరాలు ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని ఫోన్లో “కింగ్ వాయిస్” ఫీచర్‌ను అందించారు. ఇది మెనూలు, ఇన్కమింగ్ కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా తెలియజేస్తుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా ఇందులో SOS ఫంక్షన్ కూడా ఉంది. వివిధ ప్రాంతాల వినియోగదారుల కోసం ఫోన్లో 9 భాషలకు సిస్టమ్ ఇంటర్ఫేస్ సపోర్ట్ ఉంది. ఇందులో భాగంగా ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, తెలుగు, తమిళం, పంజాబీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో BIS సర్టిఫైడ్ డిస్ప్లే సపోర్ట్ ద్వారా 22 భారతీయ ప్రాంతీయ భాషల్లో టెక్స్ట్‌ను పంపవచ్చుకూడా.
ప్రాసెసర్, స్టోరేజ్
ఈ కొత్త మొబైల్లో UNISOC SC6533G ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 4MB RAM, 8MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ప్రత్యేకమైన microSD కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 32GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో ఫొటో ట్యాగింగ్ సదుపాయంతో గరిష్ఠంగా 500 కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ 2G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. 900MHz, 1800MHz బ్యాండ్లలో పనిచేస్తుంది.అలాగే ఇందులో వైర్లెస్ FM రేడియో, రికార్డింగ్, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, వాయిస్ రికార్డర్, LED టార్చ్, మ్యూజిక్, వీడియో ప్లేయర్, ఫైల్ మేనేజర్, క్యాలెండర్, అలారం, కాలిక్యులేటర్ వంటి కీలక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
itel ACE 4 Shine ధర
itel ACE 4 Shine ధరను కంపెనీ రూ.1,059గా నిర్ణయించింది. ఇది ఐటెల్ కు చెందిన ఆన్లైన్, ఆఫ్‌లైన్ సేల్స్ ఛానళ్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. కస్టమర్ సపోర్ట్ కోసం Carlcare సర్వీస్ నెట్‌వర్క్‌తో పాటు దేశవ్యాప్తంగా 1,000కుపైగా సర్వీస్ సెంటర్లు, 1.3 లక్షల రిటైల్ టచ్పాయింట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!