OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
- 900 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామేశ్వరం మెట్ట..
- ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళితులకు కేటాయింపు..
- క్రమంగా లీజుల పేరుతో భూ బకాసురుల చేతుల్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైనా బావేగానీ… వంగతోట కాడ కాదన్నది సామెత. అయితే… దానికి ఫుల్ రివర్స్‌లో ఉందట వాళ్ళ వ్యవహారం. మనం ఎక్కడైనా కొట్టుకుందాం గానీ… అక్కడికి వచ్చేసరికి మాత్రం కాంప్రమైజ్ అయిపోదామంటున్నారు టీడీపీ, వైసీపీ నాయకులు. రచ్చ చేసుకుంటే ఏం వస్తుంది..? ఎవడో వచ్చి వాలిపోవడం తప్ప. అదే అండర్ స్టాండింగ్‌తో పోతే మనమే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చన్న మాటలు ఎక్కడ వినిపిస్తున్నాయి? అసలు టీడీపీ, వైసీపీ కాంప్రమైజ్ కహానీ ఏంటి?
పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది రామేశ్వరం మెట్ట ఏరియా. అప్పట్లో.. ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో దళితులకు అసైన్ చేసిన భూములతో కలిపి దాదాపు 900 ఎకరాల్లో విస్తరించి ఉంది రామేశ్వరం మెట్ట. షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార వ్యవస్థ ద్వారా 492 మందికి ఇక్కడ 579 ఎకరాలు కేటాయించారు. జీడి మామిడి తోటల ఉపాధి కల్పనా పథకం కింద ఇచ్చిన భూమి ఇది. 1987లో అప్పటి సీఎం ఎన్టీఆర్ స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గండేపల్లి మండలంలో కొందరికి పట్టాలు కూడా ఇచ్చారు. కానీ… కాల క్రమంలో…. ఇవన్నీ లీజుల పేరుతో పెద్దలుగా చలామణి అవుతున్న గద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జీడి తోటలు కాస్తా… మైనింగ్ కేంద్రాలుగా మారిపోయాయి. దళిత సహకార సంఘాలు పేరిట పట్టా ఉన్న రైతులు కూలీలుగా మారిపోయారు. భూమిని లీజుకు తీసుకున్న పెద్దలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నేతల కన్ను ఈ మెట్ట మీద పడింది.
Also Read
గత కొద్ది సంవత్సరాలుగా దీన్ని పూర్తిగా దున్నేస్తున్నారు. వందల లారీల్లో లక్షల ట్రిప్పుల మట్టి తరలిపోతోంది. అయినా సరే… ఇదేమని అడిగేవాళ్ళు లేరు. ఈ అడ్డగోలు తవ్వకాలను అడ్డుకునే కనీస ప్రయత్నం కూడా జరగదు. ఇక్కడ అధికార, ప్రతిక్షాలు ఒక అండర్ స్టాండింగ్‌కు రావడమే ఇందుకు కారణం అంటున్నారు. మీరు పవర్లో ఉంటే మీరు దున్నుకోండి, మాకు అధికారం వస్తే మేం తవ్వుకుంటాం… అంతే తప్ప మనలో మనం అడ్డుపడి యాపారం చేయకుండా ఉంటే ఎలా…? మనం మనం పెద్దాపురం అంటూ లోకల్ టీడీపీ, వైసీపీ నేతలు ఒక అవగాహనతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ పది పైసలకు అనుమతి తీసుకుని లక్ష రూపాయలు వ్యాపారం చేస్తున్నారంటే…మట్టి దోపిడీ ఏ రకంగా జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు స్థానికులు. ఈ దెబ్బకు మెట్ట పూర్తిగా ధ్వంసం అయిపోతోంది. టీడీపీ, వైసీపీ… ఎవరు అధికారంలో ఉంటే… వాళ్లకు ఈ మెట్ట మీద ఆటోమేటిక్‌గా పెత్తనం వచ్చేస్తుందట. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిగా దున్నేశారు.
ఇప్పుడిక టీడీపీ వాళ్ల వంతు వచ్చిందట. పెద్దాపురం నియోజకవర్గంలో అయితే… కనీసం అప్పుడప్పుడన్నా మట్టి తరలిపోతోందని హడావిడి చేస్తుంటారుగానీ…జగ్గంపేటలో మాత్రం…చాలా కంఫర్టబుల్‌గా… దున్నుకోండంటూ… అగ్రిమెంట్ చేసుకున్నారట. దాంతో… లోకల్ తెలుగు తమ్ముళ్లు మట్టి మీద మామూలుగా సంపాదించడం లేదని చెప్పుకుంటున్నారు. వెనక ఉండి నడిపించే వాళ్ళ సపోర్ట్‌తో రెచ్చిపోతున్నారట. అంత జరుగుతున్నా… స్థానిక వైసీపీ నాయకులు మాత్రం అబ్బే… అలాంటిదేం లేదు, మాకేం కనిపించడం లేదే అంటూ… చాలా తీరుబడిగా సమాధానం చెబుతున్నారట. అక్రమ మైనింగ్ జరుగుతుంటే… విపక్షంగా అడ్డుకోవాల్సింది పోయి వేడుక చూస్తారేంటని ఎవరైనా ప్రశ్నిస్తే… పైన మా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదంటే… ఏదో ఉందనేకదా…? అంతకుమించి ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకు లేదని చమత్కారంగా సమాధానం చెబుతున్నారట. ఇప్పుడు పవర్లో వాళ్ళు ఉన్నారు. నాలుగు రూపాయలు వెనకేసుకుంటారు. రేపు మేం అధికారంలోకి వస్తాం…. అప్పుడు మేము చేసేది కూడా అదే కదా అంటూ కాస్త గడుసుగానే సమాధానం చెబుతున్నారట రెండు నియోజకవర్గాల వైసీపీ నాయకులు.
రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు కొట్టుకుంటే…చివరకు మిగిలేదేంటో తెలియదా..? మాకు అంత అవసరం ఏం వచ్చిందంటూ సింపుల్‌గా మేటర్ క్లోజ్ చేస్తున్నారట. మరోవైపు పర్యావరణ ప్రేమికులు కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్లి ఈ దారుణాల్ని ఆపాలని ఫైట్ చేశారు… వెంటనే తవ్వకాల్ని నిలిపివేయాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. అధికారులు కూడా ఏమీ జరగనట్టు, మాకేం కనిపించడం లేదు, వినిపించడం లేదన్నట్టు ఉన్నారని అంటున్నారు. కోర్టు ఆదేశాలు ఓకేగానీ… మేం ఫీల్డ్‌లోకి వెళ్లాలి, టేపులు పట్టుకుని కొలతలు కొలవాలి, అంచనాలు వేయాలి… అందుకు టైం పట్టదా అంటూ ముక్తాయింపునివ్వడం చూసి స్థానికులు నోరెళ్ళబెడుతున్నారట.
రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పకుంటూ కాలం గడిపేస్తున్నట్లు ఈజీగానే అర్థమయిపోతోందంటున్నారు స్థానికులు. మరీ తప్పదన్నట్టు ఒకటి అరా వాహనాలు సీజ్ చేస్తున్నా…. తర్వాత ఆటోమేటిక్‌గా మాయమైపోతున్నాయట. వెనకాల ఉండి నడిపించేది అధికార పార్టీకి చెందిన కీలక నేతలైనప్పుడు ఆమాత్రం కన్వీనెంట్ ఉండదా అన్న చమత్కారాలు సైతం ఉన్నాయి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే…. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రామేశ్వరం మెట్టను కొల్లగొట్టే కేరక్టర్స్ ఎప్పటికీ మారవు. ఆ మైనింగ్ సిండికేట్ కి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మాత్రం అధికారాన్ని బట్టి మారుతూ ఉంటారు. సగానికి పైగానే కొండ ఇప్పటికే కరిగిపోయింది… కొన్ని చోట్ల అయితే కరెంటు స్తంభాలు గాలిలో వేలాడుతున్నాయి. మొత్తానికి రామేశ్వరం మెట్ట విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక డీల్ చేసుకున్నాయన్నది లోకల్ వాయిస్. అయితే నువ్వు, లేదంటే నేను తవ్వుకోవాలి, నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి తప్ప…. మధ్యలో మందికి వదిలేయడం ఎందుకంటూ జెంటిల్మెన్ అగ్రిమెంట్ చే
తాజావార్తలు
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
-
Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!