ఎన్టీవీ షార్ట్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముచ్చింతల్‌లో నాలుగోరోజు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు కీలక ఘట్టాలు జరగనున్నాయి. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. నేడు రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలు క్రతువుల్లో స్వల్ప మార్పులు చేశారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ల జంగా రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి తుదిశ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎంపీ జంగారెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, ఇంద్రసేన రెడ్డి ఇతర నేతలు.
Also Read
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు కాగా తాజాగా ఐదులక్షలు దాటాయి.
భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు మరో 1,27,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 1,059 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 7.98 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
కాశ్మీర్, నోయిడాలో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి వుంది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది.
తాజావార్తలు
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!