OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- వైరా, అశ్వారావుపేట, ఇల్లందు బీఆర్ఎస్లో వర్గపోరు
- పార్టీ చెప్పినా కలిసే ప్రసక్తే లేదంటున్న లీడర్స్
- వైరాలో మనీషా, చంద్రావతి, గిరిబాబు గ్రూప్స్
- పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం తోపులాటలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: పార్టీ పవర్లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే ఏంటి? మా రూటే సపరేటు. పార్టీ ప్రయోజనాలతో పనిలేదు. మా ఇగోలే మాకు ముఖ్యమని అంటున్నారట అక్కడి గులాబీ లీడర్స్. ప్రోగ్రామ్ ఏదైనాసరే… ఎడముఖం పెడ ముఖమే తప్ప కలిసే ప్రసక్తే లేదంటున్నారు? ఏ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో ఉందా వాతావరణం? అక్కడి ప్రత్యేక పరిస్థితులేంటి?. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… బీఆర్ఎస్ సమన్వయ లోపంతో సతమతం అవుతోంది. పార్టీ నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారట. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు అధిష్టానం పిలుపునిస్తే…ఎవరికి వారేనని అంటున్నారు తప్ప ఉమ్మడి కార్యాచరణ మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మూడు గ్రూపులు కూడా ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని పార్టీ వర్గాలే అంటున్నాయి.
అధికారంలో లేకున్నాసరే… కార్యక్రమాల్లో ఒకర్ని ఒకరు నెట్టుకుంటూ, తోసుకునే స్థాయికి విభేదాలు చేరుకున్నట్టు చెబుతున్నారు. ఇక బహిరంగ విమర్శలు, ఘర్షణలు సర్వ సాధారణమైపోయాయని అంటున్నారు. వైరా, అశ్వారావు పేట, ఇల్లందు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉందని అంటున్నారు. పార్టీ అధినాయకత్వం ఏ పిలుపునిచ్చినా… మేం కలవంగాక కలవబోమని అంటున్నారట ఇక్కడి నాయకులు. వైరా నియోజకవర్గంలో మూడు వర్గాలుగా ఉంది బీఆర్ఎస్. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూతురు మనీషాది ఒక వర్గం, మాజీ ఎమ్మెల్యే చంద్రావతిది మరో వర్గం కాగా… కొత్తగా గిరిబాబు వర్గం కూడా తయారైందట. ఇలా ఎవరికి వారు ఆధిపత్యం కోసం పాకులాడుతుండటంతో… పార్టీ కునారిల్లుతోందన్నది కేడర్ అభిప్రాయం. వర్గపోరుతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో సైతం తోపులాటలు పెరుగుతున్నాయి.
Also Read
- OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
ఇక అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇక్కడ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఇద్దరూ వేర్వేరుగా చేస్తుంటారు. గతంలో టీడీపీ తరపున ఒకసారి, వైసీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు తాటి వెంకటేశ్వరరావు. అలాగే మెచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ… ఇప్పుడు ఇద్దరూ అశ్వారావుపేట బీఆర్ఎస్ ముఖ్య నాయకులే. అటు పార్టీ అధిష్టానం కూడా ఇద్దర్నీ ప్రోత్సహిస్తోందట. ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ దిండిగాల రాజేందర్ చెరో వర్గంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా వేరువేరుగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పరిపాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో సైతం ఎవరి దారి వారిదే. ఈ వర్గ విభేదాలు కార్యకర్తల్లో గందరగోళం పెంచుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన హరి ప్రియ తరువాత బీఆర్ఎస్లో చేరిపోయారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారామె.అయితే ఆమెకు మొదటి నుంచి రాజేందర్తో విభేదాలున్నాయి. ఎంతచేసినా… రాజేందర్ ఈ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం అయితే లేదు. ఎందుకుంటే… ఆయన బీసీ. ఇల్లందు ఎస్టీ రిజర్వ్ సీటు. అయినా ఇద్దరూ కలిసి పనిచేసే పరిస్థితి లేదు. ఇలా… మూడు నియోజకవర్గాల్లో గులాబీ గుద్దులాటలు తీవ్ర స్థాయికి చేరాయి.
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!