iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro Max Quick Review: యాపిల్ ఈసారి తన లైనప్‌తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. సాధారణ ఐఫోన్ 18 వెర్షన్‌ను పక్కనపెట్టి.. ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ తో పాటు సరికొత్తగా ‘ఐఫోన్ డ్యూయో’ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఐఫోన్ 18 ప్రో సిరీస్ సేల్స్ షురూ కాగా, డ్యూయో మాత్రం అక్టోబర్ చివరి నాటికి మార్కెట్లోకి రానుంది. మామూలుగా ఐఫోన్ 7 సిరీస్ నుంచి చూస్తే యాపిల్ ఒకే డిజైన్ పాటర్న్‌ను కొన్నేళ్ల పాటు కొనసాగిస్తూ వస్తోంది. ప్రతి కొత్త లాంచ్‌లోనూ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ మార్పులపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. ఐఫోన్ 18 ప్రో మాక్స్ చూడటానికి సరిగ్గా ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాగే ఉంటుంది. అవే అల్యూమినియం బాడీ, దాదాపు సేమ్ లుక్ అండ్ ఫీల్. అయితే పైపైన సేమ్‌గా అనిపించినా, లోపల మాత్రం కొన్ని కీలక మార్పులు చేశారు.
ధర విషయానికొస్తే, భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ 256GB బేస్ మోడల్ ధర రూ.1,79,900గా ఉంది. ఇది ఏకంగా 2TB వరకు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. అంటే ఇది కేవలం కాస్ట్లీ ఫోన్ మాత్రమే కాదు, యాపిల్ తీసుకొచ్చిన అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటి. ఓ జాతీయ మీడియా ఈ ఫోన్‌ను కొన్ని రోజులు వాడి దాని రివ్వ్యూను వెల్లడించింది. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. 18 చూడటానికి దాదాపు పాత మోడల్ లాగానే కనిపిస్తుంది. 6.9 అంగుళాల OLED డిస్ప్లే, 120Hz ప్రోమోషన్, డైనమిక్ ఐలాండ్ అన్నీ యథాతథంగా ఉన్నాయి. అయితే ఈసారి డైనమిక్ ఐలాండ్ సైజ్ కొద్దిగా తగ్గించడంతో స్క్రీన్ ఏరియా కాస్త పెరిగింది. డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంది, ఎండలో బయట నిలబడి చూసినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పైగా యాపిల్ ఇందులో కొత్తగా యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఇవ్వడం బాగా ప్లస్ అయింది.
Also Read
- Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
కానీ ఫోన్ చేతిలోకి తీసుకోగానే తెలిసే ముఖ్యమైన విషయం ఏంటంటే దీని బరువు! ఐఫోన్ 18 ప్రో మాక్స్ బరువు 249 గ్రాములు. పాత 17 ప్రో మాక్స్ కంటే ఇది కాస్త బరువుగా ఉంటుంది. ఒకే చేతితో ఎక్కువసేపు వాడేవారికి ఈ బరువు కచ్చితంగా అనిపిస్తుంది. పెద్ద డిస్ప్లే, పెద్ద బ్యాటరీ కావాలనుకున్నప్పుడు ఈ మాత్రం బరువు సర్దుకుపోవాల్సిందే తప్పదు. ఇక ఈ ఫోన్లో చెప్పుకోదగ్గ అతిపెద్ద అప్‌గ్రేడ్ ఏంటంటే కెమెరా! దీనిలోని 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాకు ‘వేరియబుల్ అపెర్చర్’ ఫీచర్ ఇచ్చారు. దీనివల్ల లెన్స్ ద్వారా లోపలికి వచ్చే వెలుతురును మనమే కంట్రోల్ చేయవచ్చు. డిఫరెంట్ అపెర్చర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే పాత కెమెరా కంట్రోల్ బటన్లాగే దీనిని జనాలు ఎంతవరకు వాడతారనేది చూడాలి. కానీ ప్రొఫెషనల్‌గా ఫోటోలు తీసేవారికి ఇది చాలా కంట్రోల్ ఇస్తుంది. పగటిపూట ఫోటోలు నాచురల్‌గా వస్తాయి, నైట్ షాట్స్ కూడా చాలా బాగున్నాయి. వెనుక ఉన్న మూడు కెమెరాలు కూడా 48 మెగాపిక్సెల్స్ కావడం విశేషం. అల్ట్రా వైడ్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇస్తుండగా, టెలిఫోటో కెమెరా 4x ఆప్టికల్ జూమ్, 8x ఆప్టికల్ క్వాలిటీ జూమ్‌ను అందిస్తుంది. డిజిటల్ జూమ్ 40x వరకు ఉంది. ముందర ఇచ్చే సెల్ఫీ కెమెరా విషయానికొస్తే, 18 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆటోఫోకస్, సెంటర్ స్టేజ్, ఫోకస్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉండటంతో వీడియో కాల్స్ ఎక్కువ మాట్లాడేవారికి ఇది సూపర్ అప్‌గ్రేడ్.
పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో ప్రపంచంలోనే తొలిసారిగా 2nm ఆర్కిటెక్చర్‌తో రూపొందించిన ‘A20 ప్రో’ చిప్సెట్ వాడారు. ఇందులో 6-కోర్ CPU, 7-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఉన్నాయి. ఇంటెన్సివ్ టాస్క్‌లు చేసినప్పుడు ఫోన్ వేడెక్కకుండా కొత్త వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. బెంచ్ మార్క్ స్కోర్లలో ఇది అందరింటే ముందుంది. ఫోన్ ఓపెన్ చేయడం, 4K వీడియోలు ఎడిట్ చేయడం, హెవీ గేమ్స్ ఆడటం ఇలా దేనికైనా ఫోన్ అసలు తగ్గదు. అయితే డైలీ యూజ్‌లో సాధారణ వినియోగదారుడికి ఈ A20 ప్రో చిప్ పూర్తి పవర్ అవసరం పడకపోవచ్చు. గేమ్స్ ఆడేవారికి, వీడియో ఎడిటింగ్ చేసేవారికి, AI ఫీచర్లు ఎక్కువగా వాడేవారికి ఇది పర్ఫెక్ట్.
ఇకపోతే యాపిల్ ఇంటిలిజెన్స్, సిరి AI విషయాల్లో ఐఫోన్ ఇంకా కాస్త మెరుగుపడాల్సి ఉంది. ఈ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కొత్త iOS27 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో సిరి మునుపటి కంటే బాగా మాట్లాడగలుగుతోంది, పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. AI కూడా సిస్టమ్‌లో బాగా భాగమైంది. కాకపోతే కాంపిటీషన్‌తో పోలిస్తే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. రాబోయే అప్డేట్లలో ఇవి ఇంకా బాగుపడతాయని ఆశించవచ్చు. చివరగా.. ఈ ఫోన్ కొనాలో వద్దో అనే విషయానికొస్తే, మీ దగ్గర ఇప్పటికే ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉండి, దానంతటదే బాగా పనిచేస్తుంటే.. వెంటనే 18 ప్రో మాక్స్‌కి మారాల్సిన పెద్ద అత్యవసర అవసరమేమీ లేదు. కానీ మీ దగ్గర ఐఫోన్ 14, 15 లేదా అంతకంటే పాత మోడళ్లు ఉంటే మాత్రం, ఈ చేంజ్ మీకు ఒక భారీ డిఫరెన్స్‌ను చూపిస్తుంది. మెరుగైన కెమెరా, వేగవంతమైన ప్రోసెసర్, మెరుగైన బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్, AI ఫీచర్లు ఒకే చోట దొరుకుతాయి. ముఖ్యంగా ఫోన్లో ఎక్కువ కెమెరా, వీడియో కంటెంట్ క్రియేట్ చేసేవారికి, ఫోన్‌ను లాంగ్ టర్మ్ వాడాలనుకునేవారికి ఐఫోన్ 18 ప్రో మాక్స్ బెస్ట్ ఛాయిస్!
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!