Mounika
Author- NTV Telugu-
Arijit Singh : ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అర్జిత్..!
కోట్ల మందిని తన పాటలతో మాయ చేసే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్.. తాజాగా పాటలు పాడటం (Playback Singing) ఆపేస్తున్నానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ వార్త విన్న ఆయన అభిమానులు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాటలకు దూరం కావడం లేదు, కేవలం […] -
Bhumi : ఆరేళ్ల చిన్నారిపై సామూహిక దాడి.. వీధి కుక్కలపై చర్చిస్తాం.. కానీ, వీటిపై మాత్రం మాట్లాడం!
దేశ రాజధాని ఢిల్లీలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఈ అమానవీయ ఉదంతంపై బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో నేరస్థులకు చట్టం అంటే భయం లేకుండా పోతోందని, పసి ప్రాణాలకు రక్షణ కల్పించడంలో మనం ఘోరంగా విఫలమవుతున్నామని ఆమె ఆవేదన చెందారు. కేవలం 10 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న బాలురు […] -
Champion: సడెన్‌గా OTT ఎంట్రీ ఇచ్చిన.. యంగ్ హీరో మూవీ
యంగ్ హీరో రోషన్ మేకా కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ (Champion). పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఇంటెన్స్ డ్రామాను దర్శకుడు ప్రదీప్ అద్వైతమ్ తెరకెక్కించారు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించాయి. భారీ అంచనాల మధ్య 2025 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేస్తోంది. Also Read : Om […] -
Om Shanti Shanti Shantihi : జంటలకు బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
సినిమా టికెట్ల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్న ఈ రోజుల్లో, తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం ‘వన్ ప్లస్ వన్’ (Buy 1 Get 1 Free) ఆఫర్‌ను ప్రకటించారు. ముఖ్యంగా జంటగా వచ్చే వారికి ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే […] -
Preeti Mukundhan : బాలీవుడ్‌లోకి ‘కన్నప్ప’ బ్యూటీ..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ కథానాయిక ప్రీతి ముకుందన్, తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ‘నెమలి’ అనే పాత్రలో ఆమె నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే, ఇప్పుడు ఈ భామ టాలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హిందీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్న కార్తీక్ ఆర్యన్ సరసన ప్రీతికి బంపర్ ఆఫర్ దక్కినట్లు సమాచారం. […] -
Rajinikanth: తలైవా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్: రజనీకాంత్ బయోపిక్‌పై ఐశ్వర్య క్రేజీ కామెంట్స్!
ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది.. సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రస్థానం అసాధారణం. కోట్ల మంది అభిమానులు ఆరాధించే రజనీకాంత్ జీవిత కథ (బయోపిక్) ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రజనీ కుమార్తె ఐశ్వర్య క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. తన తండ్రి ఆటోబయోగ్రఫీకి సంబంధించిన చిత్ర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు. […] -
Tarun Bhascker : వారిని శాటిస్ఫై చేసే టాలెంట్ నాకు లేదు..
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తాజాగా స్టార్ హీరోలతో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. క్రియేటివిటీకి పెద్దపీట వేసే ఈ యువ దర్శకుడు, కమర్షియల్ హంగులతో కూడిన సినిమాల పట్ల తన అసహనాన్ని వ్యక్తపరిచారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక స్టార్ హీరో ఫ్యాన్ బేస్‌ను సంతృప్తి పరిచే రకమైన సినిమాలు తీసే టాలెంట్ నాకు లేదు’ అని చాలా ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. […] -
Hari Hara Veera Mallu : ‘హరిహర వీరమల్లు’ పార్ట్ 2 అవసరమా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక కాలం షూటింగ్ జరుపుకున్న చిత్రం అంటే ‘హరిహర వీరమల్లు’ అనే చెప్పాలి. ఈ మూవీ మొదటి నుండి చాలా అడ్డంకులు ఎదురుకుంటూ వచ్చింది. పూర్తయినప్పటికి అనేక వాయిదాల తర్వాత 2025లో విడుదలైన ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ పీరియడ్ డ్రామాను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని […] -
Anil Ravipudi : బాలయ్య ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన అనిల్ రావిపూడి..
మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దీంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో తాను రూపొందించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తన కెరీర్లో ఈ సినిమా ఎంతో స్పెషల్ అని, బాలయ్య అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్‌ల […] -
Gunasekhar : రాజమౌళి కెరీర్లోనే అది బెస్ట్ సినిమా.. జక్కన్నపై గుణశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి అంటేనే బాహుబలి, RRR వంటి వెయ్యి కోట్ల భారీ ప్రాజెక్టులు గుర్తొస్తాయి. కానీ, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దృష్టిలో మాత్రం రాజమౌళి తీసిన సినిమాలన్నింటిలోకి ‘ఈగ’ (Eega) ఇప్పటికీ బెస్ట్ సినిమా అంట. తాజాగా తన కొత్త చిత్రం ‘యుఫోరియా’ ప్రమోషన్లలో పాల్గొన్న గుణశేఖర్, రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కెరీర్‌ను ‘ఈగ’ సినిమాకు ముందు, ఆ తర్వాత మిగతవి అని ఆయన అభిప్రాయపడ్డారు. Also Read : Lokesh […]
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!