Ravi Teja : రవితేజ లేటెస్ట్ మూవీస్‌లో.. ఇది గమనించారా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే ఇంకో సినిమా స్టార్ట్ చేయడం ఆయన స్టైల్. అయితే, కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఇటీవల ‘మాస్ జాతర’ తో వచ్చినా అది బ్రేక్ ఈవెన్ కూడా ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో సంక్రాంతికి (జనవరి 14న) విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, శివ నిర్వాణ డైరెక్షన్‌లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేందుకు రవితేజ సన్నాహాలు చేస్తున్నారు. ఈ హడావిడి అంతా ఒక ఎత్తైతే, గత కొంతకాలంగా రవితేజ సినిమాలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అదేంటంటే,
Also Read : Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ అప్ డేట్..
Also Read
ఆయన చిత్రాల్లో స్టార్ హీరోయిన్లు కనిపించడం లేదు.. ఇటీవల రవితేజ నటించిన సినిమాలను పరిశీలిస్తే, అందులో స్టార్ హీరోయిన్లు ఒక్కరు కూడా లేకపోవడం గమనించవచ్చు. ఉదాహరణకు, రాబోయే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లో ఆషిక రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా ఉన్నారు, వీరిద్దరూ స్టార్ బ్యూటీస్ కాదు. అలాగే, శివ నిర్వాణ సినిమాలో లీడ్ రోల్ పోషించనున్న ప్రియాంక భవాని శంకర్‌కు కూడా అంతంత మాత్రమే క్రేజ్ ఉంది. గత ఐదారు ఏళ్లుగా రవితేజ ఒక్క స్టార్ హీరోయిన్‌తో కూడా కలిసి వర్క్ చేయలేదు. అయితే, ఈ విషయంలో మేకర్స్ రాజీ పడటానికి ముఖ్య కారణం బడ్జెట్ సమస్య లేదని సమాచారం. స్టార్ హీరోయిన్‌ను తీసుకునే స్కోప్ ఉన్నా, బడ్జెట్ పరిమితుల వల్ల సాధారణ హీరోయిన్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందట. ఏదేమైనా, రవితేజ ఒక బిగ్ హిట్‌ను కొడితే ఈ లెక్కలన్నీ మారుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!