రణబీర్ కపూర్, అలియా భట్ జంట ముంబైలో ఓ అదిరిపోయే ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటి విలువ ఏకంగా 350 కోట్లు అట! ముంబైలోని సినీ ప్రముఖుల ఇళ్లల్లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైనదని చెబుతున్నారు. వాళ్ల పాత కృష్ణరాజ్ బంగ్లా ప్లేస్‌లోనే ఈ కొత్త ఇల్లు కట్టారు. ఈ ఆరు అంతస్తుల బిల్డింగ్ చూడటానికి సంప్రదాయంగా, లోపల మాత్రం లేటెస్ట్ ఫీచర్లతో ఉంది. చిన్నపాటి భూకంపం వచ్చినా తట్టుకునేంత స్ట్రాంగ్‌గా దీన్ని కట్టారట. ఇంటి కోసం వాడిన అద్దాలు, ఫర్నిచర్ అన్ని ఇటలీ నుంచి, కిచెన్ సామాన్లు ఏకంగా నెదర్లాండ్స్ నుంచి తెప్పించుకున్నారు. విలాసానికి తగ్గట్టుగానే, ఇందులో దాదాపు 15 కార్లు పార్క్ చేసుకునేంత పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది.
Also Read : Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ అప్ డేట్..
ఈ ఇంట్లో ఎవరికి ఏ ఫ్లోర్ కేటాయించారో కూడా పక్కా ప్లాన్ చేశారు. ఒక ఫ్లోర్ రణబీర్ తల్లి నీతూ సింగ్‌కు, ఇంకో ఫ్లోర్ రణబీర్, అలియా, వాళ్ళ పాప కోసం ఉందట. ఒక ఫ్లోర్‌ను కేవలం కథలు వినడానికి కేటాయించారట! మిగతా ఫ్లోర్స్ గెస్ట్‌ల కోసం. ఇందులో రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఒకటి టెర్రస్ పైన. టెర్రస్ గార్డెనింగ్ కోసం ఏసియా దేశాల నుంచి మొక్కలు తెప్పించారు. ఈ ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. హాల్లో పెట్టిన వినాయకుడి విగ్రహం. అయోధ్య రామమందిరం కోసం బాల రాముడి విగ్రహాన్ని చెక్కిన అర్జున్ యోగిరాజ్ చేతే ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించడం విశేషం. డబ్బుంటే ఇలాంటి విలాసం ఉంటుంది మరి..!