బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో తనకు మళ్లీ తోడు దొరుకుతుందని అస్సలు ఊహించలేదని తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుత ప్రేయసి గౌరీ స్ప్రాట్ గురించి చెబుతూనే, తన ఇద్దరు మాజీ భార్యలతో తనకు ఉన్న విడదీయలేని అనుబంధంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : Suriya 47: చెన్నైలో..పూజ కార్యక్రమాలతో సూర్య 47 గ్రాండ్ ఓపెనింగ్..
‘నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నా జీవితంలోకి వచ్చిన రీనా, కిరణ్ ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు. మేము భార్యాభర్తలుగా విడిపోయామే తప్ప, మనుషులుగా ఎప్పుడూ విడిపోలేదు. నా గుండెల్లో వారిద్దరికీ ఎప్పుడూ గౌరవం, ప్రేమ ఉంటాయి. మాది ఇప్పటికీ ఒకే కుటుంబం, రీనా తల్లిదండ్రులు, కిరణ్ తల్లిదండ్రులు అందరూ కలిసి మెలిసి ఉంటాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. పెళ్లి బంధం ముగిసిన, స్నేహం మాత్రం కొనసాగుతుందని ఆయన మాటల ద్వారా స్పష్టమైంది. మరోవైపు,
‘60 ఏళ్ల వయసులో తనకు భాగస్వామి దొరకడం అసాధ్యమని అనుకున్న సమయంలో గౌరీ స్ప్రాట్ నా జీవితంలోకి వచ్చింది. గౌరీ నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాలో ఎంతో ప్రశాంతత, స్థిరత్వం వచ్చాయి. ఆమెను కలవడం నా అదృష్టం’ అని ఆమిర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. గౌరీ ప్రస్తుతం ఆమిర్ నిర్మాణ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ విమానాశ్రయాల్లో, వేడుకల్లోనూ జంటగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.