టీ 20 ప్రపంచ కప్ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైనప్పటికీ.. కివీస్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ 20 ప్రపంచ కప్ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్ నుంచి భారత్ కు బయలుదేరిన న్యూజిలాండ్ జట్టు ఎయిర్‌పోర్ట్ వరకు బస్ లో వచ్చింది. […]
విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు చినికిచినికి గాలివానగా మారుతోందా? ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది? బొత్స సొంత జిల్లాలో మేనల్లుడి హవా? విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రంలేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స […]
టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ రెస్టారెంట్ వివాదంలో చిక్కుకుంది. పూణెలోని రెస్టారెంట్‌పై ఎస్ వియ్ ఎగ్జిస్ట్ ఇండియా అనే ఎల్జీబీటీ క్యూఐఏ ప్లస్ కమ్యూనిటీ తీవ్ర ఆరోపణలు చేసింది.ఈ రెస్టారెంట్‌లోకి గే, లెస్బియన్, ట్రాన్స్ కమ్యూనిటీ వారిని అనుమతించడం లేదని ఆరోపించింది. అంతేకాదు, కోహ్లీకి చెందిన ఇతర రెస్టారెంట్లు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని దుమ్మెత్తి పోసింది. ఈ ఆరోపణలపై ‘వన్8 కమ్యూన్’ వర్గాలు స్పందించాయి. తమ రెస్టారెంట్లలో ఎలాంటి లింగ వివక్షకు […]
హైదరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన దంత వైద్యురాలు, పాజిటివ్ డెంటల్ సీఈఓ డాక్టర్ పేర్ల సృజన గారు ప్రఖ్యాత సినీ నటుడు సోను సూద్ గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఫేమ్ 2021ను స్వీకరించారు. డా. సృజన గారు దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు చేస్తున్నారు.స్మైల్ డిజైనింగ్ లో సిద్ధహస్తురాలు అయినటువంటి డా. సృజన గారు అనేక శాఖల ద్వారా వేలాది మందికి తమ సేవలు అందించారు. 13-11-2021న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ […]
ఒకరు ఐపీఎల్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్..! మరొకరు అండర్ -19లో చెరగని ముద్రవేసిన కోచ్. వీరిద్దరి కాంబినేషన్‌లో తొలి సిరీస్‌కు రెడీ అయ్యింది టీమిండియా. ఇవాళ జైపూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడనుంది. ఐతే పొగ మంచు విపరీతంగా ఉండటంతో… మ్యాచ్‌పై ఎఫెక్ట్ పడనుంది. న్యూజిలాండ్‌తో తొలి టీ ట్వంటీ మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. టీ-20 వరల్డ్‌కప్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముమ్మర ప్రాక్టీస్ చేశారు ఆటగాళ్లు. కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో…నెట్‌లో […]
నిన్న మొన్నటి వరకు ఆ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో పెద్దగా చడీచప్పుడు లేదు. వరసగా రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేదే అక్కడ హవా. ఆ తర్వాత ఓ మాజీ ఎమ్మెల్యే చేరిక.. తాజాగా మరో మాజీ మంత్రి రాకతో సీన్ మారిపోయింది. ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో ఉంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? ఆలేరు టీఆర్‌ఎస్‌లో వేడెక్కిన రాజకీయం..! ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన ఆలేరు నియోజకవర్గంలో రాజకీయం రంగు మారుతోంది. 2014, 2018 ఎన్నికల్లో గొంగడి సునీత […]
2031వ ఏడాది వరకు జరగనున్న 8 ఐసీసీ టోర్నీలను ఏ ఏ దేశాలు నిర్వహిస్తాయి అనేది నిన్న ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అందులో 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కు ఇచ్చింది ఐసీసీ. దాంతో ఈ నిర్ణయం పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ రమీజ్ రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ చివరిసారిగా 1996లో ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే మాకు ఒక ప్రధాన ఈవెంట్ ను […]
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో భారీగా గాంజాయి పట్టుకున్నారు పోలీసులు. వైజాగ్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర తరలిస్తున్న 45 కేజీల గాంజాయి సీజ్ చేసింది క్రైమ్ టీమ్. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ చింతల్ మెట్ చౌరస్తా లో కాపు చేసారు క్రైమ్ టీమ్ పోలీసులు… ఓ కారును అడ్డగించి తనిఖీలు చేసిన కాప్స్ కారు డిక్కిలో గాంజాయి గుర్తించారు. పోలీసులను చూసి కారును వదలి పారిపోయే యత్నం చేసిన కేటుగాళ్లు. పారిపోతున్న దుండగులను వెంబడించి పట్టుకున్నారు […]
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,197 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,73,890 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,28,555 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 301 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,64,153 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,134 మంది కరోనా నుంచి కోలుకోగా 50,71,135 మంది టీకాలు తీసుకున్నారు. […]
ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసారు. కాల్ సెంటర్‌లోని 16 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్ సెంటర్‌లోని 23 మందిలో 16 మంది అరెస్ట్ కాగా ఏడుగురు పరారీ అయ్యారు. బ్యాంక్ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ఆ ముఠాను అరెస్ట్ చేసారు. పలువురి ఖాతాల నుంచి 3 కోట్లు కాజేశారు సైబర్ నేరగాళ్లు. పలు ఫిర్యాదుల మేరకు ఢిల్లీ వెళ్లి ముఠాను పట్టుకుంది ప్రత్యేక బృందం. ఢిల్లీ […]