న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత జట్టు ప్రస్తుతం విజయానికి 9 వికెట్ల దూరంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన శ్రేయర్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో అర్ధ శతకం చేసాడు. ఇలా చేసిన మొదటి భారత ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. ఇక తాజాగా ఈ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత అయ్యర్ మాట్లాడుతూ… బ్యాటింగ్ కు ముందు కోచ్ రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడు అనేది వివరించాడు. మనం మ్యాచ్ గెలవాలి, అది నాకు చాలా ముఖ్యమైన విషయం అని చెప్పిన అయ్యర్.. రాహుల్ సార్ నేను వీలైనంత వరకు మధ్యలో ఉండి స్కోర్ ను పెంచుకోవాలని చెప్పాడు. బౌలర్ల మైండ్‌సెట్ తో ఆడాలి. వీలైనన్ని ఎక్కువ బంతులు ఎదుర్కోవాలి అన్నారు. అయితే నేను మ్యాచ్ కు ముందు చాలా దూరం ఆలోచించలేదు. కేవలం వర్తమానంపై దృష్టి పెట్టాను” అని అయ్యర్ చెప్పాడు. అయితే అయ్యర్ ఈరోజు బ్యాటింగ్ కు వచ్చే సమయానికి జట్టు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేది తెలిసిందే.