ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీతో పాటు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. ఇవి నెరవేర్చే వరకు పోరాటానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన గళం విప్పనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో ప్రదర్శన చేయనున్నాయి. డిసెంబర్ 10న బ్లాక్ బ్యాడ్జీలతో, లంచ్ అవర్ ప్రదర్శన… 13న నిరసన ర్యాలీ, అన్ని తాలూకాలు, డివిజన్లలో సమావేశాలు జరపనున్నాయి. 16న తాలూకా, డివిజన్, ఆర్టీసీ డిపోలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నాలు చేయనున్నాయి. ఇక 21న జిల్లా హెడ్ క్వార్టర్స్ లో భారీ ఎత్తున ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు ధర్నాలకు దిగనున్నట్లు ప్రకటించాయి.