తెలంగాణ కాంగ్రెస్ .. ఏపీ కాంగ్రెస్‌కి అప్పు పడిందా..!? పాత బకాయిని వసూలు చేసుకునే పనిలో ఏపీ నేతలు ఉన్నారా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీసీసీకి ఆ మొత్తం ఇప్పుడు చాలా అంటే చాలా అవసరమా? ఇంతకీ టీపీసీసీ చెల్లించాల్సిన అప్పు ఎంత? టీపీసీసీ, ఏపీసీసీ మధ్య అప్పుపై కాంగ్రెస్‌లో చర్చ..! తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ కమిటీల మధ్య ప్రస్తుతం అప్పు పంచాయితీ నడుస్తోంది. అదీ 2014 నుంచీ వసూలు కాకుండా ఉండిపోయిన అప్పుగా చెబుతున్నాయి పార్టీ […]
తెలంగాణ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లేంటి? వడపోతల్లోకి వచ్చి పోతున్న నాయకులు ఎవరు? సీఎం కేసీఆర్ వేస్తున్న సామాజిక లెక్కలేంటి? ఒక్క బెర్త్ భర్తీకి వడపోతలు మొదలయ్యాయా? అధికార టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం పదవుల భర్తీ జాతర నడుస్తోంది. ఎమ్మెల్సీ పదవుల సందడి పూర్తి కాగానే.. పలు దఫాలుగా నామినేటెడ్ పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టారు. ఇంకా భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పోస్టులు చాలానే ఉన్నాయి. వాటి కోసం […]
ఏసీబీ డీజీగా బాధ్యతలు చేపట్టారు అంజనీ కుమార్. తనని ఏసీబీ డీజీగా నియమించేందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…హైదరాబాద్ కమిషనర్ గా చేసిన పని సంతృప్తినిచ్చింది. అన్ని వర్గాల నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంది. నాతో పాటు కలిసి మూడు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు పనిచేసిన అధికారులకు ధన్యవాదాలు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మా డిపార్ట్మెంట్ ఎంతో సహాయ సహకారాలతో ముందుకెళ్లింది. హైదరాబాదులో ఒక మంచి సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిని ఇన్నాళ్ల […]
సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విత్తన ధృవీకరణ సంస్థ నూతన భవన,గోదాము శంకుస్థాపన చేసారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పారుక్ హుసేన్, జెడ్పి చైర్మన్ రోజా శర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, వ్యవసాయ అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ… దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మార్కెట్ లను రద్దు చేశారు. ప్రభత్వలు రైతుల కోసం పనిచేయాలి. […]
ఆ జిల్లాలో చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ఓ పెద్ద మాఫియా. పురాతన బౌద్ధ మహాస్థూపం ఉన్న కొండపై మైనింగ్ గెద్దల కన్ను పడింది. కొండను తవ్వి గుల్ల చేయడానికి రంగం చేస్తోంది. సొంత జేబులు నింపుకోవడానికి చరిత్రను మాయం చేసేలా కుట్రలు బయటకొస్తున్నాయి. ఇంతకీ ఈ కుట్ర వెనక ఉన్నదెవరు? చారిత్రక కొండను తవ్వి మట్టి తరలించేలా మాఫియా ఎత్తుగడ..! ఇది తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని కొడవలి బౌద్ధ స్తూపాలు ఉన్న ధనంకొండ. […]
సినిమా థియేటర్లలో సోదాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారాయి. అయితే నిబంధనల విషయంలో రాజీపడేది లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు . నిబంధనలకు విరుద్ధంగా థియేటర్లు నిడిపితే చూస్తూ ఊరుకోవాలా అని కౌంటర్ ప్రశ్న వేస్తున్నాయి. ఈ ఊపు చూస్తుంటే మరిన్ని థియేటర్లు మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా పరిశ్రమ వర్సెస్ ఏపీ సర్కార్ రగడకు తాజా ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసినట్లు కనిపిస్తోంది. ఒక వైపు సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో ఇప్పటికే […]
అమెరికా, బ్రిటన్‌లో కరోనా కేసులు మళ్లీ పీక్స్‌కు చేరుతున్నాయి. అగ్రరాజ్యంలో ఒక్కరోజే నమోదైన కొత్త కేసులు 2 లక్షల మార్క్‌ను దాటేయగా… బ్రిటన్‌లో వరుసగా రెండోరోజూ లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ లేటెస్ట్ వేవ్ వెనుక డెల్మిక్రాన్ ఉండొచ్చనే వాదనను తెరపైకి తెచ్చారు… నిపుణులు. అమెరికాలో 24 గంటల్లో 2 లక్షల 65 వేల 32 మందికి కొవిడ్ సోకింది. ఈ ఏడాది జనవరి, సెప్టెంబర్ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు […]
ఇంఛార్జ్‌ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా.. మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ల పడుతున్న ఇబ్బందులేంటి? క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్ బ్యాక్ లేదా? ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ.. సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంఛార్జులు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇంఛార్జులను నియమించే పనిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో […]
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? బీజేపీ నాయకులను అమిత్ షా అలర్ట్ చేశారంటే ఏదో ఇండికేషన్ ఉండే ఉంటుందా? టీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేలను గ్రౌండ్‌లోనే ఉండాలని చెప్పిందా? మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..!? ముందస్తు వేడి మధ్య కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?2018 ముందస్తు ఎన్నికల్లో తేలిపోయిన కాంగ్రెస్ వ్యూహం! తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వాడీ వేడి చర్చ మొదలైంది. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ నేతలను అమిత్ షా అప్రమత్తం చేయడంతో ఏం జరుగుతుందా అని అంతా […]
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక […]