ఖమ్మంలో పెండింగ్ సమస్యలపై సీఎల్పీనేత భట్టి ఫోకస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కు శ్రీకారం చుట్టనున్నారు. మధిర నుంచి మొదలుకొని.. జిల్లా అంతటా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెలకొని ఉన్న సమస్యలపై గళం విప్పేందుకు యాత్రకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన సొంత నియోజకవర్గం మధిరలో పెద్దసంఖ్యలో రైతుకుటుంబాలున్నాయి. ఇప్పుడు ఆ రైతుల సమస్యల పరిష్కారం కోసం.. గ్రామ గ్రామాన పర్యటన చేయాలని నిర్ణయించారు భట్టి. మధిర నియోజక వర్గంలోని ముదిగొండ నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడి నుండి నియోజకవర్గం లో గ్రామలన్నిటిని టచ్ చేస్తూ యాత్ర కు ప్లాన్ చేస్తున్నారు.
Also Read
జనవరి 9 నుండి సిఎల్పీ నేత భట్టి పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీనికి రూట్ మ్యాప్ సిద్దం చేస్తోంది భట్టి టీం. ముదిగొండ నుండి… నిత్యం 10 నుండి 15 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ప్లాన్ తయారు చేస్తున్నారు. నియోజకవర్గం లో పాదయాత్ర పూర్తవ్వగానే… జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల mlc ఎన్నికల్లో పార్టీ కి కొంత జోష్ వచ్చింది. దీన్ని కంటిన్యూ చేయడం కోసం జిల్లా అంతటా పాదయాత్ర చేయాలని చూస్తున్నారు భట్టి. రైతుల సమస్యలను పాదయాత్రలో ఫోకస్ చేయాలని భావిస్తున్నారు.
భట్టి పాదయాత్ర షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ఖరారు కానుంది. ముదిగొండ నుండి మొదలై ఖమ్మం లో ముగించేలా ప్లాన్ చేస్తున్నారు భట్టి.
తాజావార్తలు
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!