ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,987 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 76,766కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 162 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 7,091 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. […]
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల ప్రకటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సి ఉందా? విద్యార్థుల్ని కనీస మార్కులతో పాస్ చేస్తే సమస్య పరిష్కారమైనట్టేనా? జరిగిన తప్పుల్ని సరిద్దిద్దుకునేది ఎలా? తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల సరళిపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాలని… ఫెయిలైన విద్యార్థుల్ని పాస్ చేసి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. ఫలితాలను అన్ని కోణాల్లో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. […]
హైదరాబాద్ లో పబ్ కల్చర్ దారి తప్పింది. పబ్ కల్చర్ కు అలవాటు పట్టి దారి తప్పుతున్నారు యూత్. నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి 2 గంటల వరకు పబ్ లు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి పబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్లపై తాగి తందనాలు ఆడుతున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్న అవేమీ పబ్ లు యాజమాన్యాలు, యువత పట్టించుకోవడం లేదు. నోటికి మాస్క్ లు లేవు… సోషల్ డిస్టెన్స్ లేదు.. గుంపులు గుంపులుగా రోడ్లపై యువత ఉంటున్నారు. […]
భారత్‌లో దక్షిణాఫ్రికా వేరియంట్ కేసులు…ఊహించని విధంగా పెరిగిపోతున్నాయ్. ఒమిక్రాన్ పాజిటివ్‌లు…450కి చేరువయ్యాయ్. రిస్క్ దేశాల నుంచే కాకుండా…నాన్ రిస్స్‌దేశాల నుంచి వచ్చిన వారిలోనూ ఒమిక్రాన్ బయటపడుతోంది. మరోవైపు పదిరాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నానాటికీ విస్తరిస్తోంది. ఇప్పటికే 17 రాష్ట్రాలకు ఈ వేరియంట్ పాకగా.. 450కి చేరువయ్యాయ్. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కొత్త వేరియంట్ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43 కేసులు నమోదయ్యాయి. […]
సఫారీ గడ్డపై టెస్ట్ ఫైట్‌కు సిద్ధమైంది… టీమిండియా. ఇప్పటివరకూ అందని టెస్ట్ సిరీస్‌ను… ఈసారి ఎలాగైనా సాధించాలన్న కసితో ఉంది. మరోవైపు ప్రొటీస్ కూడా సొంతగడ్డపై కోహ్లీ సేనను ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత ప్రాభవం కోల్పోయిన జట్టును… మళ్లీ తలెత్తుకునేలా చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగబోతున్నారు. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా… ఇవాళ్టి నుంచి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ వేట మొదలెట్టబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా […]
ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. కీలక నియోజకవర్గంలో గెలిచారు. ఇక తనకు తిరుగే లేదని అనుకున్నారో ఏమో.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్. కేడర్‌నే కంట్రోల్ చేయలేకపోతున్నారట. పైగా ఒక వర్గాన్ని వెనకేసుకొస్తున్నారని ఆరోపణలు. ఇకేముందీ.. రెండోవర్గం టైమ్ కోసం ఎదురు చూస్తోందని ఒక్కటే గుసగుసలు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎమ్మెల్యేపై వైసీపీలోని మరోవర్గం గుర్రు..! కొఠారు అబ్బయ్య చౌదరి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కోటను వైసీపీ గాలిలో బద్దలుకొట్టి ఎమ్మెల్యేగా గెలిచారు. […]
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా.. బంగారం ధరలు పెరుగుతుండటంతో… పుత్తడిని కొనుగోలు చేయాలంటే… ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,350 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సీఎం జగన్, చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మూతపడిన పరిశ్రమలను తెరవలేని వారు.. స్టీల్ ప్లాంట్ పల్లవి అందుకుంటారా.. డబ్బులు కేంద్రం ఇస్తే.. సోకులు రాష్ట్ర ప్రభుత్వానివా.. పధకాలకు ఇచ్చే డబ్బులు మళ్లించి.. బిల్లులు ఆపుతారా అని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు డబ్బులు వేశాం. కానీ మోడీ వేసిన డబ్బులను కూడా జగన్ లాగేసుకున్నారు అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్టిక్కర్ బాబులు… వీళ్లతో అభివృద్ధి […]
ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఆ ఎమ్మెల్యే విస్మరించారా? ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారా? సొంత పార్టీ నేతలే ఆయనపై ఎందుకు గుర్రుగా ఉన్నారు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఉదయగిరి వైసీపీలో వర్గపోరు తీవ్రం..! మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే. వైసీపీ నేత. విపక్షపార్టీలు ఆందోళన చేయాల్సిన చోట.. తమ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వైసీపీ కేడర్ రోడ్డెక్కుతున్న పరిస్థితి ఉదయగిరిలో ఉంది. పదవుల పంపకాల్లో వచ్చిన తేడాలు ఎమ్మెల్యేకు.. కేడర్‌కు […]
ఏపీ కాంగ్రెస్ కు త్వరలో నూతన అధ్యక్షుడు నియామకం జరగనున్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు దృష్టి సారించింది ఏఐసిసి. అయితే ఏపీసీసీ అధ్యక్షుడు ఎంపిక పై కసరత్తు పూర్తయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించారు ఏపీ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాండీ, ఇంచార్జ్ సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టఫర్ లు. ఏపీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాలు, […]