పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి అపూర్వ స్పందన లభిస్తుంది.జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ లోని జిఎచెంసి పార్క్ లో నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో బాగంగా సినీ,టివి రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని సినీ,టివి ఆర్టిస్టులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది, […]
ఓమిక్రాన్ కేసుల మధ్య మూడు టెస్ట్ ల సిరీస్ లో తలపడేందుకు సౌత్ ఆఫ్రికా కు వెళ్ళింది టీం ఇండియా. అయితే ఈ రోజు భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య మొదటి టెస్ట్ పార్రంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకొని అతిథులకు మొదట బౌలింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికాను ఒక్క సిరీస్ లో కూడా వారి సొంత గడ్డపై […]
ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఎస్సై ఉమేష్ చంద్ర మృతి చెందారు.కానిస్టేబుల్ స్టిఫెన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే మెస్ లో గోడవే ఈ కాల్పులకు కారణం అని తెలుస్తుంది. అయితే కానిస్టేబుల్ స్టిఫెన్ ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. నూగూరు వెంకటాపురం పీఎస్ లో సీఆర్పీఎఫ్ జవాన్లు ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టిఫెన్ లు మెస్ వద్ద గొడవ […]
కానూరు సిద్ధార్ధ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికారు విద్యార్ధులు. లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై సీజేఐ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు. దీంతో పీపీలు స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21 […]
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్‌టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్‌లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా? పీఆర్సీపై ఎడతెగని చర్చలు..! ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13 […]
ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో […]
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రేపటి బీజేపీ నిరుద్యోగ దీక్ష పై ఆంక్షలు విధించారు పోలీసులు. హై కోర్టు ఆదేశాల ప్రకారం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. కానీ జనవరి 2 వరకు రాష్ట్రం లో బహిరంగ సభలు, ర్యాలీ లు నిషేధం అంటూ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. అయితే దీక్ష కు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసింది. […]
అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఇండియా గేట్ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్ చేరుకుంది. వారం రోజుల […]
లుధియానా కోర్టు పేలుళ్ల కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మాజీ కానిస్టేబుల్…తన మీద నమోదైన కేసుల ఫైళ్లను కాల్చేసేందుకే…ఈ కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గగన్ దీప్‌కు…డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయ్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్‌కార్డు, వైర్‌లెస్ డోంగిల్‌ను […]
గుజరాత్ సముద్ర తీరం…డ్రగ్స్ రవాణాకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందా ? విదేశాల నుంచి వస్తున్న డ్రగ్స్…గుజరాత్ ద్వారానే దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతోందా ? కచ్ తీరంలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. గుజరాత్ తీరం…డ్రగ్స్ రవాణాకు అడ్డాగా మారిపోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయ్. ఇటీవల కాలంలో వరుసగా…వందల కోట్ల విలువ చేసే…గంజాయి గుజరాత్ తీరం పట్టుబడింది. వారం రోజుల క్రితం 4వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను కోస్ట్‌గార్డు పట్టుకుంది. ఈ కేసులో […]