తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26 […]
1986లో ‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలూ రాస్తూ, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు సీతారామశాస్త్రి. 2021 నవంబర్ 30న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రం ఏమంటే… ‘సిరివెన్నెల’తో మొదలైన ఆయన సినీ గీత ప్రస్థానం తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కోసం రాసిన పాటలో సిరివెన్నెల ప్రస్తావనతో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు రీమేక్ అయిన ఈ మూవీని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు తమన్ అందించిన గీతాలు చార్ట్ బస్టర్స్ లో టాప్ ప్లేస్ లో నిలిచాయి. జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల కాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ […]
శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా […]
నిజామాబాద్ భీమ్ గల్ టీఆర్ఎస్ బహిరంగ సభ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… నిరయోజకవర్గ భివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మ్యూనిసిపాలిటీగా మరి అభివృద్ధిపతంలో నడుస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోంది. కెసీఆర్ ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అని తెలిపారు. తెలంగాణ లో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలౌతాలేవు. […]
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం […]
సౌత్ ఆఫ్రికాలో ఓమైక్రా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నెలల్లో ఆ దేశానికి వెళాల్సిన టీం ఇండియా వెళ్తుందా.. లేదా అనే ప్రశ్న తలెత్తింది. అయితే ఈ పర్యటన జరుగుతుంది అని ప్రకటించిన బీసీసీఐ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం రెండు జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 26 న ప్రారంభం కానుండగా… చివరి వన్డే మ్యాచ్ జనవరి 23న ముగుస్తుంది. అలాగే ఈ పర్యటనలో టీ20 సిరీస్ […]
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిశారు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్లు. గతంలో ట్రాన్స్ రాయ్ సంస్థకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసి మోసపోయామని ఫిర్యాదు చేసారు 120 మంది సబ్ కాంట్రాక్టర్లు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 కోట్లు పైనే ఖర్చు చేసినా బిల్లులు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేసారు. అప్పటి నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ చేతిలో తాము మోసపోయామని తెలిపారు కాంట్రాక్టర్లు. ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన […]
ప్రస్తుతం భారత టెస్ట్ ఆటగాళ్లలో పుజారా ఒక స్టార్ ఆటగాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన నుండి అతను అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అతను నిరాశపరిచాడు. అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి పుజారా శతకం సాధించలేదు. ఈ విషయం సుదీర్ఘమైన ఫార్మాట్ లో టీమ్ ఇండియాను ఆందోళన కలిగిస్తుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. అయితే మిడిల్ ఆర్డర్‌లో అతని స్థానం […]
ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన 27 ఏళ్ల అక్షర్ పటేల్ బాల్ తో రాణించాడు… బ్యాట్ తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బ్యాట్ తో రాణించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో తన మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. అలాగే ఈరోజు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 26 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. దాంతో […]