ప్రస్తుతం భారత టెస్ట్ ఆటగాళ్లలో పుజారా ఒక స్టార్ ఆటగాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటన నుండి అతను అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అతను నిరాశపరిచాడు. అయితే దాదాపుగా మూడు సంవత్సరాల నుండి పుజారా శతకం సాధించలేదు. ఈ విషయం సుదీర్ఘమైన ఫార్మాట్ లో టీమ్ ఇండియాను ఆందోళన కలిగిస్తుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.
అయితే మిడిల్ ఆర్డర్‌లో అతని స్థానం కోసం శ్రేయాస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్ మరియు శుభ్‌మాన్ గిల్ ఇలా గట్టి పోటీ ఉంది. ఈ మధ్య వారు బాగా రాణిస్తుండటంతో పుజారా స్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది. అయితే పుజారా మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కాబట్టి 5 లేదా 6వ స్థానం వద్ద బ్యాటింగ్ చేసే వారికంటే అతనికి సెంచరీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అతను దానిని వినియోగించుకోకపోవడం జట్టును కష్టాల్లోకి నెడుతుంది అని లక్ష్మణ్ అన్నారు.