Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melt Belly Fat: నేటి కాలంలో పొట్ట దగ్గర పేరుకుపోతున్న కొవ్వు, బరువు పెరగడం చాలా మందిని వేధిస్తున్న సమస్య. జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కష్టపడలేక, డైటింగ్ చేయలేక సతమతమవుతున్నారా? అయితే మీరు మీ ఉదయపు అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు.. సులభంగా బరువు తగ్గవచ్చు. ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Parachute Training: 50 అడుగుల ఎత్తులో పారాచూట్ ఫెయిల్.. ఇద్దరు సైనికులకు గాయాలు
Also Read
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
రాత్రంతా నిద్రపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అందుకే నిద్ర లేవగానే కనీసం ఒక గ్లాసు నీరు తాగాలి. ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెటబాలిజం పెరగడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. నీళ్లు తాగిన తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోండి. బ్రిస్క్ వాకింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఇది మీ మూడ్‌ని కూడా రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది.
మీ మార్నింగ్ టిఫిన్ ఎప్పుడూ ప్రోటీన్లతో నిండి ఉండాలి. గుడ్లు, పప్పు ధాన్యాలు లేదా మొలకెత్తిన గింజలు తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల మీకు పదే పదే ఆకలి వేయదు, దీంతో జంక్ ఫుడ్ తినడం తగ్గి బరువు అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి కేవలం జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన పనిని వ్యాయామంగా మార్చుకోండి. అది స్విమ్మింగ్ కావచ్చు, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ లేదా డ్యాన్స్ కావచ్చు. మీకు నచ్చిన పని చేయడం వల్ల మీరు బోర్ ఫీల్ అవ్వరు, క్రమం తప్పకుండా చేయగలుగుతారు. అధిక ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక కారణం. ఉదయాన్నే కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానం లేదా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయండి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ఈ అలవాట్లను మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే, కొద్ది రోజుల్లోనే మీ పొట్ట తగ్గడం మీరు గమనించవచ్చు. క్రమశిక్షణతో కూడిన ఈ మార్పులు మిమ్మల్ని ఫిట్‌గా మార్చడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!