మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎప్పుడూ కొత్తదనం కోసం పరితపిస్తుంటాడు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం అహర్నిశలు స్క్రీప్ట్ ల వేటలో ఉన్నాడు. కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగానే వాటి రైట్స్ తీసుకుని ఆహాలో స్ట్రీమింగ్ చేసేలా కూడా ప్లాన్ చేస్తున్నాడు. అలా ‘లాక్డ్, కుడి ఎడమైతే’ వంటి సినిమాలు ఉన్నాయి. తాజాగా అలా ‘టైమ్ లూప్’ కాన్సెప్ట్ తో తెరకెక్కిన శింబు ‘మానాడు’ సినిమా రీమేక్ రైట్స్ ను అరవింద్ తీసుకున్నారట. […]
భారత జట్టు తాజాగా న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ ల సిరీస్ లో తలపడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో మొదటి టెస్ట్ ను డ్రా గా ముగించుకున్న టీం ఇండియా రెండో టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ తర్వాత తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అయితే ఇందులో బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ 5వ స్థానంలో అలాగే కోహ్లీ 6వ […]
ప్రపంచలోని బెస్ట్ ఆర్మ్డ్ హెలికాఫ్టర్లలో Mi-17 V5 ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యంత అధునాతన హెలికాప్టర్‌లలో ఒకటి.. ఈ ఛాపర్ యొక్క భద్రతా రికార్డు ప్రపంచంలోని కొన్ని ఇతర కార్గో ఛాపర్‌ల కంటే ఎంతో మెరుగ్గా ఉంది. ప్రమాదాలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి.. Mi-17V5 అనేది Mi-8/17 హెలికాప్టర్ల శ్రేణికి చెందినది.. మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ కోసం దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రదేశాల ఆర్మీలో ఈ రకం హెలికాఫ్టర్‌లను ఉపయోగిస్తున్నారు.. రష్యాకు […]
రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ జెండా పండుగ జరుపుతున్నాం. రేపు అన్ని పోలింగ్ బూత్ స్థాయి లతో పార్టీ జెండా ఎగురేయాలని పీసీసీ నిర్ణయించింది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం తోపాటు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు డిసెంబర్ 9. రేపు ఈ రెండు ప్రాధాన్యతలు కలిగిన రోజు కాబట్టి పార్టీ డిజిటల్ మెంబర్ షిప్ ప్రారంభిస్తున్నాము. రేవంత్ రెడ్డి కొడంగల్ అసెంబ్లీ పరిధిలోని పోలింగ్ […]
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ఈ సినిమాలో రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడట. గతంలో చిరంజీవితో ‘అన్నయ్య’ సినిమాలో ఆయన తమ్ముడుగా నటించాడు రవితేజ. ఇక రవితేజ ‘డాన్ శ్రీను’కి స్క్రీన్ ప్లే, ‘బలుపు’కి కథ అందించిన కె.యస్. రవీంద్ర అలియాస్ బాబీ రవితేజ ‘పవర్’ సినిమాతోనే దర్శకుడుగా మారాడు. ఇప్పుడు చిరంజీవితోనూ, దర్శకుడు బాబీతోనూ ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకుని చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో చిరు సన్నిహితుడి పాత్రలో […]
గాడ్సే అనగానే అందరికీ గుర్తొచ్చేది గాంధీ హంతకుడే! అయితే అదే పేరుతో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఓ తెలుగు సినిమా తీస్తున్నారు. గోపీ గణేశ్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ‘గాడ్సే’ చిత్రంలో సత్యదేవ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. బుధవారంతో ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇప్పటికే మూవీ రషెస్ చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా సత్యదేవ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇలాంటి […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో ఇటీవల కాలంలో చాలా మార్పు వచ్చింది. ఇతర హీరోల సినిమాలకు ప్రచారం చేయటమే కాదు తను నటించిన సినిమా యూనిట్ తోనూ ఎల్లప్పుడూ సత్సబంధాలను ఏర్పరచుకుంటున్నాడు. అంతే కాదు తనది మంచి మనసు అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. బన్నీ తను నటించిన ‘పుష్ప’ సినిమా టాప్ టెక్నీషియన్స్‌కి 10 గ్రాముల బంగారం బహుమతిగా అందజేశాడట. ‘పుష్ప’ షూటింగ్ సమయంలో అడవుల్లో వారు పడిన కష్టాన్ని దగ్గరగా గమనించాడు కాబట్టే […]
భారత జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యాటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు టెస్టులు. మూడు వన్డేలలో సౌత్ ఆఫ్రికా జట్టుతో టీం ఇండియా పోటీ పడుతుంది. అయితే ఈ పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం కొంత మంది స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం అవుతున్నారు అని తెలుస్తుంది. అయితే తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, గిల్ గాయపడిన విషయం […]
భారత టెస్ట్ జట్టు ఆటగాడు హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. అలాగే ఈమధ్య ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోకి కనీసం అతడిని ఎంపిక కూడా చేయకుండా… దక్షిణాఫ్రికా వెళ్తున్న భారత ఏ జట్టులో చేర్చారు. కివీస్ తో సిరీస్ తర్వాత భారత జట్టు అక్కడికి వెళ్లనున్న కారణంగా […]