PM Modi Apologizes: నారీ సారీ.. మహిళలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Apologizes: జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించాయో దేశం మొత్తం చూసిందన్నారు. ‘మహిళలకు నేను క్షమాపణలు చెబుతున్నా.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. నారీశక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. మహిళల కలలను ధ్వంసం చేశారు’ అని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దారుణం.. నల్ల దుస్తులు ధరించినంత మాత్రాన చీకటి ఒప్పందాలను దాచి పెట్టలేరు. నేను అన్ని పొలిటికల్ పార్టీలతో పర్షనల్‌గా మాట్లాడాను. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరాను. మహిళా రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే మీరే క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని చెప్పాను అని గుర్తు చేసుకున్నారు. అయినా చివరకు కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయి. ఈనెల 23న డీఎంకే, కాంగ్రెస్‌కు సరైన సమాధానం చెప్పాలని అన్నారు.
READ ALSO: Iran Attack On Indian Ships: భారత్ నౌకలపై దాడి.. ఇరాన్ రాయబారికి భారత్ సీరియస్ వార్నింగ్..
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
మహిళా బిల్లును ఓడగొట్టి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకొని విపక్షాలు పాపం చేశాయి. బిల్లును అడ్డుకోవడం మహిళల ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరిచిపోరు. రిజర్వేషన్లను అడ్డుకున్న వారిని మహిళలు తప్పకుండా శిక్షిస్తారు. ఇది భ్రూణహత్యలతో సమానం అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ కుటుంబ పార్టీలు. వాళ్లు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఎంతో నిజాయితీతో తెచ్చిన బిల్లును అడ్డుకున్నారు. కాంగ్రెస్ పరాన్నజీవిలా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాం. కానీ దీన్ని ఒప్పుకోవడానికి విపక్షాలు సిద్ధపడలేదు. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచన. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారని కాంగ్రెస్ పై ప్రధాని విమర్శలు గుప్పించారు.
మహిళల అభ్యున్నతికి అడ్డుపడిన పరిస్థితులను భారత్ మొత్తం చూస్తుంది. వాళ్లు మహిళ ఆశలను అంతం చేశారు. మేం మహిళలకు చేయాలనుకున్న రిజర్వేషన్లను అమలు చేయలేకపోయాం, చట్టం చేయలేకపోయాము, మహిళా రిజర్వేషన్ల కోసం చట్టం చేయలేకపోయినందుకు భారతదేశంలోని మహిళలకు క్షమాపణ చెప్తున్నా అని ప్రధాని చెప్పారు. దేశ హితమే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ పార్టీ స్వార్థ రాజకీయాల వల్ల దేశ మహిళలకు అన్యాయం జరిగిందన్నారు. నా దేశంలోని కోట్లాదిమంది పార్లమెంటు వైపు చూసారు, బిల్లు అమలు కాకపోవడం నాకు దుఃఖాన్ని కలిగించింది, బాధ కలిగించిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమకు చేసిన అవమానాన్ని మహిళలు ఎన్నడూ మర్చిపోరు, మహిళా మనసులో వాళ్లు చేసిన పని ఎప్పటికీ నిలిచిపోతుంది, మహిళ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్న నాయకులకు క్షేత్రస్థాయిలో మహిళలే సమాధానం చెప్తారని ప్రధాని అన్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!