RCB vs DC: ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన ఆర్సీబీ.. ఐపీఎల్‌లోనే తొలి టీమ్‌గా నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs DC: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓటమి పాలైంది. అయినప్పటికీ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే వేదికపై (చిన్నస్వామి స్టేడియం) 100 మ్యాచ్‌లు ఆడిన మొదటి జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. అయితే, ఈ మైలురాయి మ్యాచ్‌లో ఆర్‌సీబీ బ్యాటర్లకు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది.
READ MORE: Melt Belly Fat: రోజూ ఉదయాన్నే ఈ 5 పనులు చేస్తే పొట్ట కరిగిపోవాల్సిందే!
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. నిశ్శంక (1), కరుణ్ నాయర్ (5), సమీర్ రిజ్వీ (2)లను పెవిలియన్ పంపి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ (57; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. అయితే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. రాహుల్ అవుటైన తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ (59 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయానికి చేరవ చేశాడు. అక్షర్ పటేల్ (26) మెరుపులు మెరిపించినా గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చివరి 2 ఓవర్లలో ఢిల్లీ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన రసిక్ సలామ్ కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీపై ఒత్తిడి పెంచాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. ఈ సమయంలో మిల్లర్ ‘కిల్లర్’ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ పథంలో నడిపించాడు. రోమారియో షెపర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో తొలి రెండు బంతులకు కేవలం 2 పరుగులే వచ్చాయి. కానీ 3వ, 4వ బంతికి డేవిడ్ మిల్లర్ వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 5వ బంతికి ఫోర్ కొట్టడంతో ఢిల్లీ ఒక బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది.
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!