పాతబస్తీలో హిట్ అండ్ రన్ కేసు లో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న సాయంత్రం శాలిబండ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది బెంజ్ కార్. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సుమారుగా 17 గంటలు దాటుతున్నా ఇప్పటి వరకు కారు డ్రైవర్ ను పోలీసులు పట్టుకోలేదు. అయితే అది మహారాష్ట్రకు చెందిన బండిగా గుర్తించారు. MH04EX8282 నంబర్ బెంజ్ కార్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు… నిన్న సాయంత్రం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి […]
ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారు. అన్ని అంశాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలని ఏపీ ప్రభుత్వం కోరింది. రేపే అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు… ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ […]
ఏపీలో గత కొన్ని రోజులుగా చర్చాంశనీయంగా మారిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నిర్ణయించే అంశంపై మంత్రి వెలంపల్లి చర్యలు తీసుకుంటున్నారు. పీఠాధిపతి నియమాకాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని ధార్మిక పరిషత్తుకు మంత్రి వెలంపల్లి సూచించారు. పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేకాధికారిగా దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు ధార్మిక పరిషత్. పీఠాధిపతి నియామకంపై వివిధ పీఠాధిపతులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి నియామక ప్రక్రియను వీలైనంత త్వరగా […]
హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను […]
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అందులో డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దని ఏపీకి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు… రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలనూ లేఖలో ప్రస్తావించింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్న అంశాన్ని లేఖలో పేర్కొన్న కేఆర్ఎంబీ… ప్రాజెక్టు సైటులో నిపుణుల బృందం పర్యటనకు ఏపీ సహకరించడం […]
జియో వచ్చిన రోజునుండి టెలికాం రంగంలో దూసుకపోతునే ఉంది. అయితే తాజాగా 5జీ స్మార్ట్‌ఫోన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ తో తాజాగా రిలయన్స్ జతకట్టింది. ఈ విషయాన్ని తాజాగా ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇరు కంపెనీలు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడం కోసం కలిసి పనిచేయనున్నాయి. రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. గూగుల్‌తో వ్యహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నామని తెలిపారు. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్‌ఫోన్ […]
ధర్మకర్తగా ఆయనది అధికారం. వ్యవస్థను గాడిలో పెట్టే దిశలో ప్రభుత్వానిది అజమాయిషీ. ఈ రెండింటి మధ్య ఇప్పుడు సంఘర్షణ జరుగుతోంది. అధికారులు అడకత్తెరలో పడ్డారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకి కోపం అన్నట్టు నలిగిపోతున్నారు. ఇంతకీ ఆ వివాదం ఎక్కడిది? ఈ స్టోరీలో చూద్దాం. గత ఏడాది అనువంశిక ధర్మకర్త బాధ్యతల నుంచి అశోక్ తొలగింపు సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ్మస్వామి దేవస్థానం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ వ్యవహారాలకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు […]
సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి. ఈసారి ప్రకాశ్ రాజ్ […]
ఎన్‌సిపి నేత శరద్‌పవార్ నివాసంలో మంగళవారం ప్రతిపక్ష నాయకుల సమావేశం గురించిన కథనాలన్నీ చాలా త్వరగా తేలిపోయాయి. ఏ సమావేశమైనా సరే దాని నిర్వాహకులెవరు, ఉద్దేశమేమిటనేదానిపై ఆధారపడి వుంటుంది. కాని ఈ సమావేశం విషయంలో ప్రతిదీ భిన్న కథనాలతో నడిచింది. శరద్ పవార్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు కలుసుకొని చర్చలు జరపడం దీనికి తొలి సంకేతమైంది. తర్వాత రాష్ట్రీయ మంచ్ నాయకుడుగా బయిలుదేరి ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాద్యక్షులుగా వున్న మాజీ బిజెపి […]
శక్తి వంతమైన భారతదేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు మోడీ. స్వంతంగా మెజారిటీ ఉన్నా అందరినీ కలుపుకుని పోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల పాలు చేసారు కేసీఆర్. బీజేపీకి భయపడి గడీల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్ […]