తెలకపల్లి రవి : మా ఎన్నికలపోటీలో కొత్త కోణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమ దానికదే ఒక ప్రత్యేక ప్రపంచమైనా ప్రచారం ప్రభావం ఆకర్షణ చాలా ఎక్కువగా వుంటాయి. నటుల రాజకీయ ప్రవేశం ప్రభుత్వాల ఏర్పాటు అనుకూల వ్యతిరేక రాజకీయాల కారణంగా ఇది మరింత పెరుగుతుంటుంది. తెలుగు సినిమా నటీనటుల సంఘం మా ఎన్నికలు అందుకే గత రెండు మూడు పర్యాయాలుగా చాలా ఆసక్తి పెంచుతున్నాయి. పోటీలో వున్న అభ్యర్థులు ఎవరన్నది ఒకటైతే వారిని బలపర్చేవారెవరూ ఎవరి బలం ఎంత వంటి ప్రశ్నలు ముందుకు తెస్తున్నాయి.
ఈసారి ప్రకాశ్ రాజ్ తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు చిత్రపరిశ్రమలో విలన్‌గా క్యారెక్టర్ యాక్టర్‌గా అరుదైన రికార్డు ఆయనది.రాజకీయంగా మోడీ ప్రభుత్వ విధానాలను నిశితంగా విమర్శించేందుకు వెనుకాడలేదు. పరిశ్రమలో ఆయన గురించి కొన్ని వివాదాలు వున్న మాట కూడా నిజమే అయినా సేవాకార్యక్రమాలు రాజకీయ చొరవ ప్రత్యేకత ఇచ్చాయి, హైదరాబాదు కేంద్రంగా వున్న తెలుగు చిత్ర పరిశ్రమపై తెలంగాణ రాజకీయాల ప్రభావం ఎక్కువనుకుంటే కెసిఆర్ ప్రభుత్వంతోనూ ప్రకాశ్ రాజ్‌కు సంబంధాలెక్కువ. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శిబిరం అండదండలువున్నాయని కూడా ప్రచారం జరిగింది. సాక్షాత్తూ నాగబాబు మాట్లాడటం కన్నా దీనికి తార్కాణం అక్కర్లేదు. అయితే గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లలో పనిచేసిన చిరంజీవి ఇప్పుడు జగన్ ప్రభుత్వంతోనూ సత్సంబంధాలు పాటిస్తుంటారు. తాజాగా ఎపిలో లక్షల వాక్సిన్‌లు ఒకేరోజు వేయడాన్ని అభినందించడం ఇందుకో ఉదాహరణ. మరి పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా జనసేన బిజెపితో పొత్తులో వుండగా దాన్ని వ్యతిరేకించే వ్యక్తి ప్రకాశ్ రాజ్. కాంగ్రెస్ తెలుగుదేశం వారు గతంలో కలసి పనిచేసినట్టే కళాకారుల సమస్యలకు రాజకీయాలకు సంబంధం లేదనే మాట ఇక్కడ ముందుకు రావచ్చు, అంతకన్నా ప్రకాశ్‌రాజ్ స్థానికేతరుడనే వాదన కూడా తెచ్చినా అది నిలిచేది కాదు. ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్‌లో వ్యవసాయం చేయడమే గాక నటుడుగా తెలుగువారితో పరిశ్రమతో పెనవేసుకున్నారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ప్రకాశ్‌రాజ్‌ప్రకటించిన సమయంలోనే మంచు విష్ణు కూడా పోటీలో వున్నట్టు ప్రకటించడం తండ్రి మోహన్‌బాబుతో కలసి హీరో కృష్ణను కలిసిన ఫోటో విడుదల చేయడం పెద్ద ట్విస్ట్.ఇంకొంతమందితో పాటు కృష్ణం రాజు కూడా ఆయనకు మద్దతు నిచ్చారంటున్నారు. గతంలో బహిరంగంగానే విమర్శించుకున్న మోహన్‌బాబు చిరంజీవి ఇప్పుడు స్నేహపూర్వకంగా వుంటున్నారనేందుకు సన్నాఫ్ ఇండియా కు చిరు వాయిస్ ఇవ్వడమే నిదర్శనం. నరేష్ అద్యక్షుడైనాక మా వ్యవహారాలు సరిగ్గా లేవని ఈ ఉభయుల సమక్షంలో వేదికపై రభస జరిగింది కూడా. రాజకీయంగా మోహన్‌బాబు కూడా జగన్‌కు మద్దతుగా బయిలుదేరినా ఈ ప్రభుత్వం బకాయిలు ఇవ్వకపోవడం వంటివాటిపై విమర్శలు చేశారు. మహాభారతంలో అర్జునుడు దుర్యోధనుడు వస్తే కృష్ణుడు చేసినట్టుగా చిరంజీవి పరిస్తితి తయారైందని ఎవరో రాశారు. అయితే ఎన్నికల బరిలోకి దిగాక స్పష్టత దానికదే రావలసిందే. మంచు విష్ణు రంగప్రవేశంతో పోటీ రసవత్తరంగా తయారవడం తథ్యం. ఇంకా జీవితా రాజశేఖర్,హేమ కూడా రంగంలో వున్నా బహుశా వీరి మధ్యనే పోటీ కేంద్రీకృతం అవుతుంది. ఈ లోగా మధ్యవర్తులు మల్లగుల్లాలు చాలా వుంటాయి. సినిమా మలుపుల కంటే ఇవేమీ తక్కువగా వుండవు. కాకపోతే అవి ఆరోగ్యకరమైన పోటీగా వుండాలి.పరిశ్రమకూ కళాకారులకూ మేలు జరగాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!