శక్తి వంతమైన భారతదేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు మోడీ. స్వంతంగా మెజారిటీ ఉన్నా అందరినీ కలుపుకుని పోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల పాలు చేసారు కేసీఆర్. బీజేపీకి భయపడి గడీల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఒక్క రూపాయి కేటాయించలేదు. ప్రతి సీఎం కు కేంద్రం ప్రభుత్వమే నిదులు ఇస్తుంది. 18సంవత్సరాలు దాటిన యువతీయువకులు క్షేమంగా ఉండాలన్న ఆలోచన కేసీఆర్ కు లేదు. అందుకే వాక్సిన్ డ్రైవ్ ప్రారంబించలేదు. కనీస కృతజ్ఞత లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అని అన్నారు. ప్రజలకు న్యాయం జరగాలన్నా.. గడీల పాలన అంతం కావాలంటే బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు అని పేర్కొన్నారు.