హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను ఎంపిక చేయగా నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని నియమించింది.