పాతబస్తీలో హిట్ అండ్ రన్ కేసు లో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న సాయంత్రం శాలిబండ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది బెంజ్ కార్. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. సుమారుగా 17 గంటలు దాటుతున్నా ఇప్పటి వరకు కారు డ్రైవర్ ను పోలీసులు పట్టుకోలేదు. అయితే అది మహారాష్ట్రకు చెందిన బండిగా గుర్తించారు. MH04EX8282 నంబర్ బెంజ్ కార్ లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు… నిన్న సాయంత్రం అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి పాదచారులపై పైకి దూసుకెళ్లారు. ఘటనా స్థలంలోనే సాలమ్మ చనిపోయింది. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు పోలీసులు.