ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే […]
ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతోందని లేఖలు రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? 24 గంటల్లో వారికి ఏమైంది? తడబడ్డారా.. తొందపాటుతో ఇరుకున పడ్డారా? ఏదో చేయబోతే.. ఇంకేదో అయ్యిందా? సీమ ప్రాజెక్టులపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి యుద్ధం జరుగుతోంది. నీరే నిప్పుగా మారిన పరిస్థితి. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి స్పందిస్తోంది టీడీపీ. ఇలాంటి సమయంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు […]
పెట్రోల్ , గ్యాస్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్నారు అని శైలజానాథ్ అన్నారు. 14 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు పెట్రోల్ పేరిట దోచుకున్నారు. దీనిపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు. ఒక్క స్టేట్ టాక్స్ 40 రూపాయలు ఉంది, కేంద్రం 30 రూపాయలు టాక్స్ వేస్తోంది. నేపాల్, శ్రీలంక లో తక్కువ ధరలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ అని ప్రశ్నించారు. మీ ఆర్థిక మిత్రులకు దోచి పెట్టడానికి […]
ఉద్యోగాలు ఇస్తా అని కౌశిక్ రెడ్డి మోసం చేశాడు అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఆడియో టేపుతో అడ్డంగా దొరికిన దొంగ కౌశిక్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈటలను ఎందుకు తిట్టలేదు. కౌశిక్ రెడ్డి ఓ దొంగ… నువ్వు రేవంత్ కాలి గోటికి సరిపోవు అని తెలిపారు. 2018 ఎన్నికల్లో నువ్వెన్ని కోట్లు తెచుకున్నావ్. డబ్బులు ఇస్తేనే పీసీసీ వస్తది […]
దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్లు తీసుకున్నాడు మోసగాడు. ఒడిస్సా కు చెందిన సంబంధ్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సీఈఓ, ఎండీ దీపక్ కిండో అరెస్ట్ అయ్యారు. నాబార్డ్ కు 5 కోట్లు లోన్ తీసుకున్న దీపక్… తిరిగి మూడు కోట్లు చెల్లించిన స్నేహితుడు మరో రెండు కోట్లుకు టోపి పెట్టడంతో.. నాబార్డ్ అధికారి ఫిర్యాదుతో […]
దర్భంగా నిందితులను మరోసారి కస్టడీ కి తీసుకుంది ఎన్ఐఎ. ఇప్పటికి వారం రోజలపాటు కస్టడీలోకి తీసుకుని ముగ్గురు నిందితులను విచారించిన ఎన్ఐఎ… కస్టడీ ముగియటంతో నిందితులను శుక్రవారం కోర్ట్ లో హాజరు పరిచారు అధికారులు. దర్యాప్తు దృష్యా మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని కోర్ట్ కు విన్నవించుకున్న ఎన్ఐఎ… ఈ నెల 16 వరకు నలుగురు నిందితుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్ట్. నలుగురు నిందితులను బీహార్ నుండి ఢిల్లీ కి తరలించిన ఎన్ఐఎ… మాలిక్ […]
శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. దాంతో శ్రీశైలం నీటి మట్టం పూర్తిగా తగ్గిపోతుంది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో 7,063 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 808.70 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 33.5771 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రాలలో […]
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 31,443 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,05,819 కి చేరింది. ఇందులో 3,00,63,720 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,31,315 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2,020 మంది మృతి చెందారు. […]
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండగా… ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటన్నిటి ప్రభావంతో దాదాపు దేశమంతటా చురుగ్గా రుతుపవనాలు. కోస్తాంధ్ర తెలంగాణల్లో రానున్న 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ప్రమాదముంది. సముద్రతీరం అల్లకల్లోలంగా […]