దర్భంగా నిందితులను మరోసారి కస్టడీ కి తీసుకుంది ఎన్ఐఎ. ఇప్పటికి వారం రోజలపాటు కస్టడీలోకి తీసుకుని ముగ్గురు నిందితులను విచారించిన ఎన్ఐఎ… కస్టడీ ముగియటంతో నిందితులను శుక్రవారం కోర్ట్ లో హాజరు పరిచారు అధికారులు. దర్యాప్తు దృష్యా మరి కొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని కోర్ట్ కు విన్నవించుకున్న ఎన్ఐఎ… ఈ నెల 16 వరకు నలుగురు నిందితుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్ట్. నలుగురు నిందితులను బీహార్ నుండి ఢిల్లీ కి తరలించిన ఎన్ఐఎ… మాలిక్ సోదరుల తో పాటు ఖాఫిల్, హాజీ సలీం లను విచారించనుంది. అనారోగ్య దృశ్యా ఇప్పటి వరకు హాజీ సలీంను విచారించనీ ఎన్ఐఎ… ఈ నెల 16 వరకు హాజీ సలీంను ఎన్ఐఎ విచారించనుంది.