ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకొని తన బాబాయి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రగతి భవన్ లో మొక్కలు నాటారు మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు. ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు, హరితహారం కార్యక్రమం లో అందరు కూడా భాగస్వాములై మొక్కలు నాటాలని దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు అందరు […]
హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం.. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా కూడా మారలేదు. దాంతో 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీస్ లో పేర్కొంది క్రమశిక్షణ సంఘం. లేనిపక్షంలో తీవ్రమైన […]
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ గ్యాస్ ధరల పైన నిరసన ర్యాలీలు చేపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క ములుగులో పాల్గొంటుంది. వరంగల్ నగరంలో చేపడుతున్న నిరసన కార్యక్రమణికి హాజరు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి సిమియర్ కాంగ్రెస్ నేత దామోదర రెడ్డి హాజరుకానున్నారు. కేవలం వరంగల్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసనలు […]
హుజురాబాద్ లో ఓ ఆడియో టేప్ సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేసారు. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందని, యూత్ అందరినీ తమ పార్టీ లోకి గుంజాలని కమలాపూర్ మండలం మాధన్నపేటకు చెందిన యువకునితో సంభాషణ జరిపినట్టుగా చర్చ జరిపారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు యూత్ అందరినీ తీసుకురావాలని ఆదేశాలు ఇచ్చారు. కౌశిక్ రెడ్డి ఆడియో వైరల్ […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 37,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376 కి చేరింది. ఇందులో 3,00,14,713 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,50,899 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 724 మంది మృతి చెందారు. […]
నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ మొదటి జిల్లా పర్యటన ఇది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యా వసర ధరల పెరుగుదలకు నిరసనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ లో కు కొండా సురేఖ, మంచిర్యాల కు సిరిసిల్ల రాజయ్య, కొమురం భీం జిల్లా లో అన్వేష్ రెడ్డి పర్యటనలు […]
నిన్న తిరుమల శ్రీవారిని 18010 మంది భక్తులు దర్శించుకున్నారు. 8652 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.77 కోట్లుగా ఉంది. అయితే రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇక 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం చేయనున్నారు. సాయంత్రం పుష్పపల్లకిలో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. అలాగే 30,31వ తేదిలలో హనుమజన్మస్థలం అంశం పై టీటీడీ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతులు, పరిశోధకులు పాల్గోనున్నారు.
50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన ఆర్థిక శాఖ… గతంలో ఇచ్చిన ఖాళీ వివరాల పై సమీక్ష జరపనుంది. శాఖల వారిగా ఖాళీల ఫైనల్ జాబితా తీసుకున్న ఫైనాన్స్ […]
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,750 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,820 వద్ద నిలకడగా ఉన్నది. […]
రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నవారు.. సర్వీస్‌లో చేరి పది-పదిహేనేళ్ల తర్వాత అవినీతికి అలవాటు పడటం పాత ట్రెండ్. ఉద్యోగంలో చేరిన వెంటనే బల్ల కింద చేతులు పెట్టడం కొత్త ట్రెండ్. ఏపీ సచివాలయంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగిందట. ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఒక సమస్య IASలకే షాక్ ఇచ్చిందట. దానిపైనే సెక్రటేరియట్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉద్యోగంలో చేరిన 6 నెలల్లోనే లంచాలు! ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా కొత్తగా చేరితే ఉత్సాహంగా పనిచేస్తారు. చకచకా పనులు […]