నోటి దూల వల్లే ఆయన ఇరకాటంలో పడ్డాడా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోటి దురుసే ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టిందా? ఆయన్ని సపోర్ట్ చేసినవారిని కూడా ఇరకాటంలో పెట్టిందా? కాంగ్రెస్‌లో కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ను ఎలా చూడాలి? వేటు వేస్తారని తెలిసి జాగ్రత్త పడినా.. పార్టీలో చికాకు కలిగింది ఎవరికి?
కౌశిక్‌రెడ్డిని వివరణ కోరిన క్రమశిక్షణ కమిటీ!
Also Read
హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కౌశిక్‌రెడ్డి వ్యవహారం పార్టీలో కలకలం రేపింది. జరగబోయే ఉపఎన్నికలో తానే టీఆర్‌ఎస్ అభ్యర్థినంటూ బయటకొచ్చిన ఆయన ఆడియోపై పార్టీ సీరియస్ అయింది. రెండుగంటల్లోనే స్పందించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ.. 24 గంటల్లోనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఆ గడువు తీరకుండానే వేటు వేసింది. వాస్తవానికి టీపీసీసీకి సారథిగా వచ్చిన రేవంత్‌రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించేవారిపై వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో వెలుగులోకి వచ్చిన కౌశిక్‌రెడ్డి ఉదంతం చర్చగా మారింది.
సమాధానం చెప్పుకోలేకపోతున్న కౌశిక్‌రెడ్డి
కౌశిక్‌రెడ్డి నోటి దురుసుతనం ఆయనకే కాకుండా .. ఇన్నాళ్లూ పార్టీలో తనకు మద్దతుగా నిలిచిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇరకాటంలో పడ్డారు. గడిచిన నెలలో కౌశిక్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అప్పట్లో ఏదో చెప్పుకొన్నా.. ఇప్పుడు వివరణ ఇచ్చుకోవడానికి ఏమీ లేకుండా అడ్డంగా దొరికిపోయారు. నిన్న మొన్నటి వరకు పార్టీ మారడం లేదని ఓట్టేసిన కౌశిక్‌రెడ్డే.. తాను టీఆర్‌ఎస్ అభ్యర్థినంటూ.. టీఆర్‌ఎస్ నేతలకు ఫోన్ చేయడం.. అది ఆడియో రూపంలో బయటకు రావడం రచ్చ రచ్చ అవుతోంది.
కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌లో ఉత్తమ్ ఇబ్బందుల్లో పడ్డారా?
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కౌశిక్ తమ్ముడు వరస అవుతారు. ఇన్నాళ్లూ ఆయన అండతోనే కాంగ్రెస్‌లో హడావిడి చేశారు. మొదటి నుండి కూడా కౌశిక్ వ్యవహరం పై అనేక ఆరోపణల వచ్చాయి. సొంత పార్టీ నాయకులు… పొన్నం ప్రభాకర్… కౌశిక్… ఉత్తమ్‌ల మధ్య ఓ రేంజ్‌లో చర్చ కూడా జరిగింది. కౌశిక్ రాజకీయంగా తన దారి తాను చూసుకున్నా.. ఇబ్బందిలో పడింది మాత్రం ఉత్తమేనని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో AICC నుంచి ఓ ముఖ్య నాయకుడు ఓ కీలక నేతకు ఫోన్ చేసి ఆరా తీశారట. కౌశిక్ ఆడియో గురించి ప్రశ్నించి.. ఏ చేద్దామని అడిగారట. తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని ఆ కీలక నేత ఢిల్లీ నాయకుడికి చెప్పినట్టు సమాచారం.
కౌశిక్‌రెడ్డి తీరుపై టీఆర్‌ఎస్ గుర్రుగా ఉందా?
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరో ఇంకా ప్రకటించలేదు. ఈ సమయంలో కౌశిక్‌రెడ్డి తానే అభ్యర్థినని చెప్పుకోవడంపై గులాబీ శిబిరం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా ఎదురైన ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే పరిస్థితి కూడా చేయి దాటిపోయింది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. చీమ చిటుక్కుమన్నా… అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లడం సహజం. అలాంటిది ఇప్పుడు పరిస్థితి చూస్తే.. ఎవరు ఎప్పుడు పక్కలో బల్లెం అవుతారో అంతుచిక్కడం లేదు.
తాజావార్తలు
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!