అనంతపురం జిల్లా ఎస్పీగా ఫక్కీరప్ప బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి అని తెలిపారు. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉండేలా చూస్తాను. పాత ఎస్పీ సత్య ఏసుబాబు చేపట్టిన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి […]
ఎగువ నుండి కూడా వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయంకి వచ్చిన వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో నిల్ గా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులుగా ఉంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 807.30 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 32.7417 టీఎంసీలు ఉంది. ఇక ప్రస్తుతం ఎడమ గట్టు జల […]
టీడీపీ అధినేతకు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ సెగ తగిలింది. జిల్లాల పర్యటనలో పార్టీ జెండాలతోపాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు రెపరెపలాడాయి. గతంలో కుప్పం.. ఇప్పుడు మచిలీపట్నం. ఊరు మారినా కేడర్ రూపంలో చేస్తున్న హడావిడి సేమ్ టు సేమ్. పార్టీలో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఆ ప్రచారం వెనక ఎవరున్నారు? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! చంద్రబాబు మచిలీపట్నం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు 2019లో ఓటమి తర్వాత టీడీపీకి ఏపీలో కష్టకాలం […]
కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్య నాధ్ దాస్ లేఖ రాసారు. ఆ లేఖలో… మరో మార్గం లేకే సుప్రీంకు. ఇది కేంద్రానికి వ్యతిరేకం కాదు. కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోంది. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తలుపు తట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం లేదు. తెలంగాణ ప్రభుత్వం […]
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్-2లో సరికొత్త విధానానికి ICC ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. గత ఛాంపియన్‌షిప్‌లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచులే ఉంటే… ఒక్కో మ్యాచుకు 60 వచ్చేవి. నాలుగు మ్యాచులుంటే కేవలం 30 పాయింట్లే లభించేవి. అయితే కరోనా కారణంగా మ్యాచులు జరగకపోవడంతో దీనిని మధ్యలోనే మార్చేశారు. పర్సంటేజీ విధానం […]
హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఉప్పల్ లో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం పడగా… హయత్ నగర్ లో 19.2 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ లో 17.2 సెం. మీ వర్షపాతం నమోదు అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి కేటీఆర్ సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు . ఇక హైదరాబాద్ లో బారి వర్షాలు కురవడంతో […]
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం కోహ్లీ సారధ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్స్ లో ఓడిన టీంఇండియా తర్వాత ఇంగ్లాండ్ తో ద్వైపాక్షిక సిరీస్ లలో పాల్గొననుంది. అందుకోసం అక్కడే ఉండిపోయింది. అయితే ఇప్పుడు భారత జట్టులో కరోనా కలకలం రేపినట్లు తెలుస్తుంది. జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎక్కువ సమయం ఉండటంతో బీసీసీఐ ఆటగాళ్లకు మూడువారాలు […]
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 41,806 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 కి చేరింది. ఇందులో 3,01,43,850 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,32,041 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 581 మంది మృతి చెందారు. […]
ఏపీలో కరోనా కేసులు తగ్గుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ వస్తున్నారు. నిన్న శ్రీవారిని 16787 మంది భక్తులు దర్శించుకోగా.. 9329 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.4 కోట్లుగా ఉంది. ఇక రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కానుండటంతో వర్చువల్ సేవలు రద్దు చేసింది టీటీడీ. రేపు సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకి పై మాడ వీధుల్లో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. రేపు ఆణివార ఆస్థానం సందర్భంగా విఐపి […]