ఎల్లుండి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం 6 సెషన్స్ లో…. 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లో జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 51 వేల 606 గా ఉంది. ఇందులో […]
ఆర్‌ఆర్‌ఆర్ అనబడే రౌద్రం రుధిరం రణం చిత్రంలోని దోస్తీ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి నిర్దేశంలో గాయకుడు హేమచంద్ర పాడిన సీతారామశాస్త్రి పాట చిత్రంలో చిత్రణ అలా వుంచితే విడుదలచేసిన ట్రైలర్‌లో కూడా ఉద్వేగభరితంగా వుంది. గిరిజనులను కదిలించి పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల మధ్య వూహాజనిత స్నేహం దాని పరిణామం చిత్రకథ గనక స్నేహగీతం విడుదల చేయడం కూడా సముచితమే. పులికి విలుకానికి,తలకూ వురితాడుకూ కదిలే కార్చిచ్చుకు కసిరే […]
పెగాసస్ స్పైవైర్‌పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్‌సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం […]
హుజూరాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నేతలు, ఇంచార్జులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్ధేశం చేశారు. తాజాగా అక్కడి నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతూ… వెక్కిరించిన పనులే వెలుగునిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, కాళేశ్వరం తరహాలోనే దళితబంధు అమలుకూడా జరుగుతుంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లేవు. ఉద్యోగాలు ఊడగొట్టడమే ఆ పార్టీకి తెలుసు. 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్. బీజేపీ దొంగ నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ విజయాన్ని ఆపలేరు అని తెలిపారు. భారీ మెజార్టీతో […]
జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ కొత్త సీపీ సత్యనారాయణ సందర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట, హుజురాబాద్ ఇల్లందకుంట ,వీణవంక పోలీస్ స్టేషన్ లను సందర్శించడం జరిగింది ప్రతి మండలంలో లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయడానికి డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడటం,ప్రజా శాంతిని భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం పోలీస్ లుగా మా బాధ్యత అన్ని తెలిపారు. ఇక హుజురాబాద్ […]
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ అనే యువకుడితో జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేణుక (రేష్మ) అనే యువతికి గత తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నిన్న జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నారు షబ్బీర్. రేణుక కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.3లక్షలు రూపాయల నగదును అందించారు ఇల్లందకుంట ఇంచార్జ్ లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి […]
కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మల్లిస్తోంది అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిధులు ఖర్చు చేయకపోవటంతో రిటర్న్ వెళ్లాయి. రాజకీయ పబ్బం కోసమే ఇద్దరు ముఖ్యంత్రుల జల జగడం అని తెలిపారు. నీటి సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదు. కేంద్ర పథకాల అమలుకు టీఆర్ఎస్ సర్కార్ సహకరించటం లేదు. తెలంగాణ పల్లెలకు వచ్చే ప్రతి రూపాయి కేంద్రం నిధులే. హైదరాబాద్ ప్రజలు కట్టే పన్నులు […]
గుంటూరు జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు. భయం గుప్పిట్లో కరోనా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కంటోన్మెంట్ జోన్లలో బిగుసుకుంటున్నాయి బారికేడ్లు. గడిచిన పది రోజులుగా ఆ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో కంటైన్న్మెంట్ జోన్లలో బారికేడ్లు కట్టారు అధికారులు. ఫలితంగా జిల్లాలో వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ కరోనా విరుచుకుపడుతున్న హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు… ఎక్కడ కరోనా కేసులు నమోదైతే అక్కడ […]
కోల్‌మైనింగ్‌లో ఎపిఎండిసి- ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక మందడుగు వేసింది అని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ వారం నుంచే తవ్వకాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైనింగ్ చేపడుతున్న ఏపీఎండీసీ… ఏటా 5 మిలియన్ టన్నుల […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,641 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,968 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్ […]