జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ కొత్త సీపీ సత్యనారాయణ సందర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట, హుజురాబాద్ ఇల్లందకుంట ,వీణవంక పోలీస్ స్టేషన్ లను సందర్శించడం జరిగింది ప్రతి మండలంలో లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయడానికి డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడటం,ప్రజా శాంతిని భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం పోలీస్ లుగా మా బాధ్యత అన్ని తెలిపారు.
ఇక హుజురాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. నోటిఫికేషన్ ముందు నోటిఫికేషన్ తరువాత కౌంటింగ్ తరువాత మూడు సందర్భాలలో మా యొక్క పోలీస్ విధులు కీలకంగా ఉంటాయి. ఎక్కడ ఘర్షణ పూరితమైన వాతావరణం, వైషమ్యాలు కులమత బేధాలు లేకుండా చూడాలి. సంసాయాత్మక ప్రాంతాలు,సంసాయాత్మక వ్యక్తుల పట్ల ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా జరిపించడం జరుగుతుంది. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి ఘర్షణలకు పాల్పడితే వారి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అది ఒక ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఎన్నికలలో ఇరువర్గాలు వారు సంయమనం పాటించాలి. ప్రజ భద్రతకు, ప్రజా స్వామ్యానికి, శాంతి భద్రతకు, విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు.