కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ అనే యువకుడితో జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేణుక (రేష్మ) అనే యువతికి గత తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నిన్న జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నారు షబ్బీర్. రేణుక కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ.3లక్షలు రూపాయల నగదును అందించారు ఇల్లందకుంట ఇంచార్జ్ లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, టీఆరెస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… షబ్బీర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్ట కరం. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవడానికి ప్రయత్నించిన స్వాగతించాలి. ప్రతి చావును రాజకీయంగా చూద్దాం అనుకోని, నీచ రాజకీయం చేస్తున్నారు. మతాంతర వివాహం చేసుకున్న వారిని దగ్గరకు రానివ్వక పోవడం బాధాకరం. షబ్బీర్ భార్యకు టీఆరెఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ రోజు రూ.3లక్షల ఆర్థిక అహాయం చేశాం. వారిని జీవితంలో నిలబెట్టేందుకు కృషి చేస్తాం. ఎవరైన శవ రాజకీయాలు చేస్తే, వారికి ఇక్కడ ఉన్న దళితులే సమాధానం చెబుతారు అని పేర్కొన్నారు.