కోల్‌మైనింగ్‌లో ఎపిఎండిసి- ఆంధ్ర ప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మరో కీలక మందడుగు వేసింది అని భూగర్భ, ఖనిజ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ సింగ్రౌలి జిల్లాలోని సుల్యారీ బొగ్గుగనిలో మైనింగ్ భూమిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ… ఈ వారం నుంచే తవ్వకాలు ప్రారంభం అవుతాయి. నెల రోజుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. 1298 హెక్టార్ల భూమిలో, 2000 కోట్ల రూపాయల పెట్టుబడితో మైనింగ్ చేపడుతున్న ఏపీఎండీసీ… ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు రిజర్వు చేయబడ్డాయి అని పేర్కొన్నారు.