రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీ తో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ… గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకి అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తాము. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ఇక ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి […]
ఆ కోటాలో ఎమ్మెల్సీ అవుతామని అధికారపార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుడు తన్నుకుపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే కోటాలో అయినా ఛాన్స్ ఉంటుందా? సొంత జిల్లా నుంచి ఆయనకు ఎదురవుతున్న సవాళ్లేంటి? ఎవరాయన? లెట్స్ వాచ్! ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేది ఎవరో? తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేసింది అధికార పార్టీ. ఇటీవల కాంగ్రెస్ నుంచి […]
ఆ జిల్లాతో ఆమెకు ఎప్పట్నుంచో పరిచయం. అప్పుడెప్పుడో ఒకసారి ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఇటీవల ఓ కార్యక్రమం కోసం జిల్లాకు వచ్చిన ఆమె.. ఓ సీనియర్ నేతను ఉద్దేశించి.. మీరు కూడా మంత్రి అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఓ కామెంట్ పాస్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఆ నాయకుడి అనుచరులకు సంతోషానివ్వగా.. జిల్లా రాజకీయాల్లో మాత్రం కొత్త పెట్టేలా ఉన్నాయట. ఇంతకీ ఎవరామె? ఏంటా కామెంట్స్? ప్రసాదరావును ఉద్దేశించి లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలపై […]
పీవీ సింధూ… సైనా నెహ్వాల్… ఆటలో ఇద్దరూ ఇద్దరే. బ్యాడ్మింటన్‌లో భారత కీర్తిపతాకాన్ని ప్రపంచస్థాయిలో రెపరెపలాడించినవారే. కాకపోతే, సైనా సీనియర్.. పీవీ సింధూ కాస్త జూనియర్. అయితే, వీళ్లిద్దరి మధ్యా అగాథం ఏర్పడిందా? ఇద్దరూ మాట్లాడుకోవడం లేదా? టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలించిన పీవీ సింధుకు.. మాజీ కోచ్ గోపీచంద్ సహా ఎంతోమంది ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరి సైనా నెహ్వాల్ ఎందుకు.. సింధూని విష్ చేయలేదు. ఇప్పుడు భారత క్రీడాభిమానులు ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ […]
వాళ్లంతా గడుసు ఖాకీలు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడంలో సిద్ధహస్తులట. మాఫియాలతో అంటకాగడంలో వారికి మించినవాళ్లు లేరనే చర్చ డిపార్ట్‌మెంట్‌లోనే ఉందట. పైగా ఫ్రెండ్లీ పోలీస్ మాటకు కొత్త అర్థం చెబుతున్న పోలీసులపై పెద్ద బాస్‌లు కన్నేశారు. ఇంకేముందీ మళ్లీ చర్చలోకి వచ్చారు ఆ జిల్లాలోని పోలీసులు. వారెవరో.. ఎక్కడివారో ఈ స్టోరీలో చూద్దాం. గద్వాల ప్రాంతంలో ఖాకీల అవినీతిపై ఓపెన్‌గానే చర్చ! కంచే చేను మేసిన తీరుగా ఉందట గద్వాల జిల్లా పోలీసుల తీరు. నడిగడ్డ […]
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధూ.. కోచ్‌ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. ఏడాదిన్నరగా పార్క్ శిక్షణ ఇస్తున్నాడనీ… భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తాననీ తేల్చి చెప్పింది. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదన్న సింధూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని చెప్పింది. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సింధు. టోక్యోలో కాంస్యం గెలిచాక […]
జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమన్వయ కమిటీ మీటింగ్ జరిగింది. టైం షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం సమాచారం కావాలని కోరారు అని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని చర్చిస్తాం అని చెప్పారు. టైం ఫ్రేమ్ కావాలని వాళ్లు అడిగారు. ప్రభుత్వంతో చర్చించి అన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. తెలంగాణ హాజరు కాని విషయాన్ని వారినే అడగండి. మేం అన్ని ప్రొసీజర్స్ ను గౌరవిస్తాం. నోటిఫికేషన్ లో ప్రాజెక్టుల అనుమతుల టైం […]
తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభాలెక్కల తర్వాతనే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణ లోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని సూచించింది ఏపీ పునర్విభజన చట్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026 లో నిర్వహించే జనాభా లెక్కల పూర్తి అయున తర్వాతనే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం స్పష్టం […]