మొన్నటి వరకు రెండు రాష్ట్రాల్లో ఆయన కీలక నేత. ఒకానొక సమయంలో సీఎం రేస్ వరకు వెళ్లారు. రాజకీయాలంటే బోర్ కొట్టిందో ఏమో సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక సామాన్యుడిలా మారిన ఆయన జీవనశైలిని చూసి ఆశ్చర్యపోయారు జనం. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. మరి.. ఇకనైనా అజ్ఞాతం వీడతారా? ఎవరా నాయకుడు? రెండున్నరేళ్లుగా నీలకంఠాపురంలోనే రఘువీరారెడ్డి! మెరిసిన గడ్డంతో.. సామాన్య రైతులా కనిపిస్తున్న ఈయన ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో […]
పంతం నీదా..నాదా అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంద్రవెల్లి సభ. చూస్తుండగానే పెద్ద సవాల్‌గా మారిందీ సమస్య. సభ నిర్వహిస్తామని ఒకరు.. వద్దని ఇంకొకరు భీష్మించడంతో పార్టీలో చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు ఆధిపత్యానికి పోటీ పడుతుండటంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రేవంత్, మహేశ్వర్‌రెడ్డిల మధ్య ఇంద్రవెల్లి సభ చిచ్చు! దళిత గిరిజన ఆదివాసీల ఆత్మగౌరవ దండోరాకి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా నాయకుల మధ్య పంచాయితీ.. ఏకంగా పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో […]
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. క్యాప్టివ్ మైన్స్ ను వైజాగ్ స్టీల్స్ కు ఎందుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం లేదు అన్నారు. పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దాం. మనము ఓట్లు వేస్తే ఉన్న కేంద్ర ప్రభుత్వం… ప్రజల ఆలోచనలకు కట్టుబడి ఉండాలి. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మితే సహించేది లేదు… ఆంధ్ర వాళ్ళము చూస్తూ ఉరుకొము. వెస్ట్ బెంగాల్,కేరళలో ప్రభుత్వ రంగ […]
ఒలింపిక్స్ లో భారత్ చరిత్ర ఎప్పుడూ తీసికట్టే. మనతో ఎందులోనూ సరితూగని దేశాలు కూడా విశ్వ క్రీడా వేదికపై తలెత్తుకుని సగర్వంగా నిలబడుతుంటే.. ఇండియా మాత్రం పతకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. అడపాదడపా సాధించే విజయాలను అపురూపంగా కళ్లకద్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు టోక్యోలో కూడా మహిళలే భారత్ పరువు నిలబెట్టారు. టోక్యో ఒలింపిక్స్ తొలిరోజే వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం గెల్చింది. దేశ చరిత్రలో ఒలింపిక్స్ తొలిరోజే పతకం రావడం […]
ఏపీ బీజేపీ పూర్తిగా మారిపోయిందా? రోజూ రోడ్డు మీదే ఉంటోందా? ప్రజా సమస్యలు.. పార్టీ కార్యక్రమాలతో బీజీ అయిపోయిందా? ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా వచ్చింది? ఈ మార్పు వెనక ఉన్నది ఎవరు? ఢిల్లీకి చెందిన ఆ నేత అంతగా ఎలా ప్రభావం చూపుతున్నారు? ఉత్సాహపరిచారా? ఊరికే కూర్చుంటే ఊరుకోబోమని హెచ్చరించారా? శివప్రకాష్ చెప్పింది చేయకపోతే అసలుకే ఎసరొస్తుందా? ఏపీలో బీజేపీకి ఇంఛార్జ్.. కోఇంఛార్జ్ ఉన్నారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇంఛార్జ్ కాగా.. రాష్ట్రంలో ఉండి పార్టీ కార్యక్రమాల్లో […]
రాహుల్ గాంధీ సైకిల్ పై పార్లమెంట్ కు వచ్చారు. ప్రతిపక్షాల సభ్యులను అల్పాహార విందు సమావేశానికి ఆహ్వానించిన రాహుల్ గాంధీ…“ఆప్”, బి.ఎస్.పి లు మినహాయించి మొత్తం 18 పార్టీలకు చెందిన ఉభయసభలకు చెందిన నేతలు హాజరయ్యారు. “పెగసస్” సాఫ్టువేర్‌ను మోడి ప్రభుత్వం కొన్నదా…!? దేశంలో ప్రతిపక్ష నేతలు, పలువురు ప్రముఖులకు వ్యతిరేకంగా “పెగసస్” ను ప్రయోగించారా..!?, అని మాత్రమే అడుగుతున్నామని సమావేశంలో పేర్కొన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా పార్లమెంట్ కు సైకిళ్ళ పై […]
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధుకు ఏపీ నగదు బహుమానం ప్రకటించింది. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో ప్రతిభ చాటుకున్న రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసారు. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించిందన్న సీఎం… ఈ విజయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభ చాటుతున్న రాష్ట్ర క్రీడాకారులందరికీ కూడా ప్రభుత్వం తగిన రీతిలో ప్రోత్సహిస్తుందన్నారు సీఎం. పీవీ సింధుకు ఇటీవలే […]
గత నెల 25న జరిగిన హత్యకేసును శ్రీకాకుళం పోలీసులు చేధించారు. శ్రీకాకుళం టౌన్ సమీపంలోని విజయాదిత్య పార్క్ లో హత్యకు గురయ్యాడు మాజీ ఆర్మీ ఉద్యోగి చౌదరి మల్లేశ్వరరావు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు పోలీసులు. మల్లేశ్వరరావును హతమార్చాడు సొంత బావమరిది సీపాన అప్పలనాయుడు. విజయాదిత్య పార్క్ కు పిలిపించి మరో ఐదుగురితో కలిసి హత్య చేసాడు అప్పలనాయుడు. ఈ హత్యకు ఆరులక్షల ఒప్పందం చేసాడు. ముందుగా 4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. […]
కర్నూలు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట రాజు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసాడు. భార్య జయంతి కాపురానికి రాలేదని మనస్తాపంతో డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది గమనించిన సెంట్రీ కానిస్టేబుల్ నాగరాజు మంటలను ఆర్పీ ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు జిజిహెచ్ కు తీసుకెళ్లారు. మంటలు అదుపు చేసేక్రమంలో కానిస్టేబుల్ నాగరాజుకు గాయాలు అయ్యాయి. రాజు కర్నూలు నివాసిగా గుర్తించారు. వెల్దుర్తి మండలం గుంటుపల్లి లో వివాహం చేసుకున్న రాజు […]