సి. వి. కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది హారర్ థ్రిల్లర్ మూవీ ‘పిజ్జా’. విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సి. వి. కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ చిత్రమే ‘పిజ్జా 3’. అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా, డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తున్న ‘పిజ్జా 3 […]
విద్య..వైద్యం పై ముఖ్య మంత్రి జగన్ కు ప్రత్యేక శ్రద్ధ వుంది అని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సీజనల్ వ్యాధులను గుర్తించేందుకు ఫీవర్ సర్వే ఉదృతి కొనసాగాలి. సచివాలయం.. వాలంటీర్ లను అప్రమత్తం చెయ్యండి అని సూచించారు. ఒక ఇంట్లో జ్వరం వస్తె సచివాలయం ఉద్యోగికి తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. విశాఖ అన్ని రకాలుగా కేంద్రం కావడంతో రోగుల ఒత్తిడి వుంటుంది. ఆ పరిస్థితికి తగ్గట్టు కేజీహెచ్ లో వైద్య సదుపాయం వుండాలి. నిర్లక్ష్యంగా […]
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ -2’, ‘విక్రమ్’ సినిమాలలో నటిస్తున్నారు. ఇందులో మొదటి సినిమాను శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంటే, రెండో సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాకు ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విశేషం ఏమంటే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అధినేతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తో పాటు తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ […]
సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్’ లాంటి సందేశాత్మక సినిమాలును ఆయన రూపొందించారు. ఇప్పుడు సమకాలీన కథతో తెరకెక్కించిన ‘హనీ ట్రాప్’ మూవీని సెప్టెంబర్ 17 న విడుదల చేయటానికి సిద్ధమౌతున్నారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వి. వి. వామనరావు నిర్మిస్తున్నారు. ఈ […]
ప్రస్తుతం ఏపీలో అధికార విపక్షాల మధ్య రోడ్లకు సంబంధించిన వివాదాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… రోడ్లపై తెదేపా నేతలు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 5ఏళ్లలో 1356 కిమీ రోడ్లు వేశారు దీని ప్రకారం సగటున ఏటా 270కిలో మీటర్ల రోడ్డు మాత్రమే తెదేపా హయాంలో వేశారు. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే 1883 కి.మీ […]
తెలంగాణలో ‘బండి’ దూకుడుకు సీఎం కేసీఆర్ కళ్లెం వేశారా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగిందే తడువుగా ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు ఇచ్చేశారు. వారంతా కేసీఆర్ కు రెడ్ కార్పెట్ పర్చడం చూస్తుంటే ఢిల్లీ పెద్దల వద్ద కేసీఆర్ కు ఎంత పలుకుబడి ఉందో అర్ధమవుతోంది. […]
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరమైన టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులో రెండు కోహ్లీసేన విజయం సాధించగా ఒకటి ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. మరొకటి డ్రాగా ముగిసింది. అయితే ఈ నాలుగు టెస్టులో కూడా ఇంగ్లాండ్ జట్టు ఒక్క పూర్తి స్పిన్నర్ ను జట్టులోకి తీసుకోలేదు. కేవలం ఆల్ రౌండర్ మొయిన్ అలీ మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ ఈ నెల 10 న ప్రారంభం కానున్న ఆఖరి […]
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ […]
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం. వారు ఎంత చెబితే అంత. ఎదురు తిరిగితే ఇంతే సంగతులు. ఎంతటి వారైనా కేడర్ చేతిలో దెబ్బలు తినాల్సిందే. కాదూ కూడదు అంటే ఎంతకైనా తెగిస్తుండటంతో.. అధికారపార్టీలో చర్చగా మారారు ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యేకు తెలిసే అనుచరులు చేస్తున్నారా? తెలిస్తే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న. కేడర్ రెచ్చిపోతుంటే.. ఎమ్మెల్యే మౌనం! కర్నూలు జిల్లా ఆదోని. సాయిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ సాయి ప్రసాద్‌రెడ్డి కంటే అధికారపార్టీ నేతలుగా.. ఎమ్మెల్యే […]
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 54,970 సాంపిల్స్ పరీక్షించగా.. 1,178 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 1,266 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,242 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,94,855 కి చేరింది.. […]