CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Set for Another Blow Ahead of IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఫ్రాంచైజీని వీడగా.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ కూడా జట్టుకు వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యాడని పలు అంతర్జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్న స్టీఫెన్ ఫ్లెమింగ్.. తన కోచింగ్ బృందంలో బ్యాటింగ్ కోచ్‌గా చేరాలని మైకేల్ హస్సీని సంప్రదించినట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్లెమింగ్, హస్సీలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో అధికారిక ఒప్పందం కుదరలేదని తెలుస్తోంది. ప్రస్తుతం 51 ఏళ్ల హస్సీ ‘ది హండ్రెడ్’ టోర్నీలో వెల్ష్ ఫైర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా కూడా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టులో చేరాలా? లేక సీఎస్కేతోనే కొనసాగాలా? అనే విషయంపై హస్సీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Also Read
- Pakistan Cricket: పీసీబీ కొత్త సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన.. 13 మంది స్టార్ ఆటగాళ్లకు షాక్..
- Sarfaraz Khan: ఆ ఆరోపణలు వచ్చినప్పుడు నా భార్య ఏడ్చింది, నాన్న కుమిలిపోయారు.. సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన..
- Travis Head: ట్రావిస్ హెడ్‌ను SRH కావాలనే వదిలేసిందా? అసలు ట్విస్ట్ బయటపెట్టిన టీమిండియా మాజీ కెప్టెన్..
- KL Rahul: గ్లెన్ ఫిలిప్స్‌కు డ్రింక్స్ కొనిస్తా.. రివ్యూపై రాహుల్ ఫన్నీ కామెంట్స్!
స్టీఫెన్ ఫ్లెమింగ్, మైకేల్ హస్సీల మధ్య దాదాపు 15 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్లో ఇద్దరూ సీఎస్కే తరఫున కలిసి ఆడారు. అనంతరం ఫ్లెమింగ్ హెడ్ కోచ్‌గా.. హస్సీ బ్యాటింగ్ కోచ్‌గా కలిసి చెన్నై జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ఇప్పుడు అదే జోడీ ఇంగ్లండ్ జట్టులో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఫ్లెమింగ్ డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటనతో ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆగస్టు 19 నుంచి పాకిస్థాన్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌కు మార్కస్ ట్రెస్కోతిక్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
బౌలింగ్ కోచ్ విషయంలో కూడా సీఎస్కేతో అనుబంధం ఉన్న మరో కోచ్ ఎరిక్ సిమన్స్‌ను ఇంగ్లండ్ జట్టులోకి తీసుకురావాలని స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం సిమన్స్ సీఎస్కేకు బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నాడు. గతంలో భారత జట్టు 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన సమయంలో బౌలింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో కోచ్‌గా పనిచేశారు. ఒకవేళ హస్సీ కూడా ఇంగ్లండ్ జట్టులో చేరితే.. చెన్నై కోచింగ్ విభాగంలో భారీ మార్పులు తప్పవు. ఇప్పటికే జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగా ఉంది.. ఇప్పుడు హస్సీ కూడా వెళ్ళిపోతే సీఎస్కే పరిస్థితి దారుణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చెన్నై భవిష్యత్‌పై ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
-
AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
-
US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
-
HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!