రాష్ట్ర స్థాయి క్రీడా అధికారులతో క్రీడా, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ… రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించాం అని తెలిపారు. అలాగే ఈ 13న కేంద్ర క్రీడల శాఖ మంత్రితో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఇక సీఎస్ఆర్ లో భాగంగా క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం, సహకారం లభించేలా ప్రయత్నం చేస్తాం అని చెప్పిన ఆయనరాష్ట్రానికి మూడు అంతర్జాతీయ […]
వైఎస్‌ఆర్ సంస్మరణ సభకు వెళ్లిన కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీలో చర్చ.. రచ్చ జరుగుతోంది. సభకు హాజరైన బీజేపీ నేతలపై కాషాయ శిబిరంలో ఎలాంటి ఉలుకు.. పలుకు లేదు. కానీ.. సంస్మరణ సభకు వెళ్లినవారి తీరుపై మాత్రం ప్రైవేట్ సంభాషణల్లో గట్టిగానే చర్చ జరుగుతోంది. వాటిపైనే ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం కర్చీఫ్ వేశారా? హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్ సంస్మరణ సభ ముగిసినా.. ఆ కార్యక్రమానికి వెళ్లిన వివిధ పార్టీల నేతలపై చర్చ మాత్రం ఆగడం […]
భారత ఓపెనర్ శిఖర్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని గబ్బర్ భార్య ఆయేషా ముఖర్జీ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే ఆయేషా ముఖర్జీకి ఇది రెండోసారి విడాకులు కావడం. ధావన్ కంటే ముందు ఒక్కరిని పెళ్లి చేసుకున్న ఆయేషా తనతో విడాకులు తీసుకోగా… 2012 సంవత్సరంలో ధావన్-ఆయేషా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక్క అబ్బాయి ఉన్నాడు. అతని పేరు జోరవర్ ధావన్. గత ఏడాది విధించిన లాక్ డౌన్ సమయంలో కొడుకుతో […]
ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి […]
బీజేపీ గట్టిగా ఊదితే కొట్టకపోయే పార్టీ తెరాసా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇంత దాదా గిరి చేస్తున్న నీకే ఇంత ఉంటే మాకు ఎంత ఉండాలి. మాకు సహనం ఉంది మౌనంగా చూస్తున్నాం. ఎన్ని తప్పులు చేస్తున్నావో లెక్క వేసి పెట్టుకుంటున్నాము. సందర్భం వచ్చినప్పుడు నీ భరతం పడతాం. కేసీఆర్ కాదు కదా ఆయన జేజెమ్మ దిగివచ్చినా హుజురాబాద్ లో గెలవలేరు అని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్న తాగుడు ఆపి, కొనుగోళ్లు ఆపి ప్రజాస్వామ్య […]
ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మరోమారు భూవివాదం చర్చనీయాంశంగా మారింది. మందస (మం) సాబకోట పంచాయతీలోని మాణిక్యపట్నంలో ఒడిశా అధికారుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసారు. అడ్డుకున్న అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి భర్త సవర గురునాథంను అరెస్ట్ చేసారు ఒడిశా పోలీసులు. పంచాయతీ ఎన్నికల తర్వాత మరోమారు తెరపైకి మాణిక్యపట్నం భూవివాదం వచ్చింది. ఈ వివాదం నేపధ్యంలో మాణిక్యపట్నాన్ని సందర్శించారు మందస తహశీల్దార్, ఎంపిడీఓ, డీఎస్పీ శివరామిరెడ్డి. ఇక […]
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ప్రేమగా ‘స్టేట్ రౌడీ’ అని గతంలో పిలుచుకునే వారు. ఆ పేరుతో ఆయన ఓ సినిమాలో నటించడమే అందుకు కారణం. ఇంతకూ విషయం ఏమిటంటే… అలనాటి ఆ ‘స్టేట్ రౌడీ’… ఇప్పుడు ‘గల్లీ రౌడీ’ మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించడానికి అంగీకారం తెలిపారు. సందీప్ కిషన్ హీరోగా వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ మెంబర్ ఎం.వి.వి. సత్యనారాయణ, ప్రముఖ రచయిత కోన వెంకట్ ‘గల్లీ రౌడీ’ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమా […]
అది పవిత్ర పుణ్యక్షేత్రం. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పాలకవర్గం.. అధికారుల మధ్య నిత్యం పోరాటాలు.. కుమ్ములాటలు. అక్రమాలకు అంతే లేకుండా పోయింది. కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతున్నా సొంత లాభానికే ప్రాధాన్యం ఇస్తున్నారట. వారెవరో.. ఆ ఆలయం ఏదో ఈ స్టోరీలో చూద్దాం. ఆలయానికి ఆదాయం పోతున్నా పట్టదు! తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలో.. వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు స్వార్థపరులు దేవుడికే శఠగోపం పెడుతున్నారు. కేవలం షాపుల నుంచే 3 […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటూ రాజకీయాల్లో, ఇటూ సినిమాల్లోనూ బీజీగా కొనసాగుతున్నారు. రాజకీయాలు పవన్ కల్యాణ్ కు కొత్తమే కాదు. ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు పవన్ లో రాజకీయ నాయకుడు పుట్టారు. నాడు ఆ పార్టీ ఆశించిన సీట్లు సాధించకపోవడంతో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లిన సంగతి అందరికీ తెల్సిందే. 2014లో పవన్ కల్యాణ్ పార్టీనైతే […]