ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ అవగాహన రాహిత్యంతోనే వారు ఖాళీ ట్రాక్టర్లను పట్టుకున్నారు. 40 మంది నా దగ్గరకు వచ్చి ఖాళీ ట్రాక్టర్లు పట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు, పచ్చ మీడియా నా పై నిఘా కోసం కొంతమంది బ్రోకర్లను పెట్టారు. వంకా, వాగుల్లో ఉన్న కాస్త ఇసుకను ఆర్బీకేలు, జగనన్న కాలనీలకు ఇస్తున్నాం అని తెలిపారు. ఈ విషయం పై సీఎంఓ నుంచి నాకు పిలుపు రాలేదు. నన్ను ఎవరూ వివరణ అడగలేదు అని స్పష్టం చేసారు మంత్రి జయరాం.