LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Nothing సబ్-బ్రాండ్ CMF కొత్త CMF Clip Pro ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌ను లాంచ్
- 3-పాయింట్ క్లిప్-ఆన్ డిజైన్, ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 5.92 గ్రాములు.
- IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్, కేస్‌కు IPX2 రేటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMF Clip Pro TWS: నథింగ్ (Nothing) సబ్-బ్రాండ్ CMF నుండి CMF Clip Pro ఓపెన్-ఇయర్ ట్రూ వైర్లెస్ (TWS) ఇయర్‌బడ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ చేసింది. ఓపెన్-ఇయర్ క్లిప్-ఆన్ డిజైన్, 10.8mm డైనమిక్ డ్రైవర్, LDAC హై-రెజ్ ఆడియో సపోర్ట్, AI ఆధారిత కాలింగ్ ఫీచర్లు, అలాగే ఛార్జింగ్ కేస్‌లో ప్రత్యేక స్మార్ట్ డయల్ వంటి ఫీచర్లతో ఈ ఇయర్‌బడ్స్ లాంచ్ అయ్యాయి.
CMF Clip Proలో 3 పాయింట్ క్లిప్ డిజైన్ ఉపయోగించారు. ఇది చెవిపై ఒత్తిడిని సమానంగా పంపిణీ చేయడం వల్ల ఎక్కువసేపు ధరించినా అసౌకర్యం కలగదు. ప్రతి ఇయర్‌బడ్ బరువు కేవలం 5.92 గ్రాములు మాత్రమే. C బ్రిడ్జ్‌లో ఫ్లెక్సిబుల్ టైటానియం వైర్ కోర్, స్కిన్-ఫ్రెండ్లీ మెటీరియల్స్‌ను ఉపయోగించగా.. ఆకౌస్టిక్ పాడ్ డిజైన్ శబ్దాన్ని నేరుగా చెవిలోకి సమర్థవంతంగా చేరేలా రూపొందించారు.
Also Read
- Vivo S2 FE: 10,000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP68 + IP69 రేటింగ్.. వివో నుంచి మరో స్మార్ట్ ఫోన్..
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
ఆడియో కోసం 10.8mm డ్యూయల్-మాగ్నెట్ డైనమిక్ డ్రైవర్ ను TPU + LCP డయాఫ్రాగమ్‌తో అందించారు. ఇవి 20Hz నుంచి 40,000Hz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్‌ను సపోర్ట్ చేస్తాయి. Hi-Res Audio Wireless సర్టిఫికేషన్‌తో పాటు LDAC, AAC, SBC కోడెక్‌లకు మద్దతు ఉంది. అదనంగా Static Spatial Audio, ఐదు ప్రీసెట్ EQ మోడ్లు, ఒక కస్టమ్ EQ ఎంపిక కూడా అందుబాటులో ఉన్నాయి. CMF ప్రత్యేక Malleus అల్గోరిథమ్ బాస్‌ను మెరుగుపరుస్తూ ట్రెబుల్ డిస్టార్షన్‌ను తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది.
కాల్స్ కోసం ప్రతి ఇయర్‌బడ్‌లో రెండు చొప్పున మొత్తం 4 HD మైక్రోఫోన్లు ఉన్నాయి. VPU ఆధారిత క్లియర్ వాయిస్ టెక్నాలజీ, ఎలిఫెంట్ సౌండ్ AI సహాయంతో గాలి శబ్దం, ట్రాఫిక్, చుట్టుపక్కల నాయిస్‌ను తగ్గించి స్పష్టమైన వాయిస్‌ను అందిస్తుంది. సౌండ్ సీల్ ఫీచర్ ద్వారా ఆడియో లీకేజ్‌ను తగ్గించవచ్చు. ఈ సెట్టింగ్‌లను Nothing X యాప్ ద్వారా మార్చుకోవచ్చు.ఈ ఇయర్‌బడ్స్‌లో హైలెట్ ఛార్జింగ్ కేస్‌పై ఉన్న “స్మార్ట్ డయల్”. దీని ద్వారా వాల్యూమ్ మార్చడం, మ్యూజిక్ ప్లేబ్యాక్ నియంత్రించడం, కాల్స్ నిర్వహించడం, బ్లూటూత్ పెయిరింగ్ వంటి పనులను ఫోన్‌ను తాకకుండా చేయవచ్చు. అలాగే ప్రతి ఇయర్‌బడ్‌పై ఫిజికల్ బటన్లు ఉండటం వల్ల వ్యాయామం చేసే సమయంలో లేదా గ్లోవ్స్ ధరించినప్పటికీ సులభంగా నియంత్రించవచ్చు.
ప్రతి ఇయర్‌బడ్‌లో 60mAh బ్యాటరీ, ఛార్జింగ్ కేస్‌లో 475mAh బ్యాటరీ అందించారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, కేస్‌తో కలిపి 32.5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ మోడ్ లో మొత్తం ప్లేబ్యాక్ సమయం 36 గంటల వరకు పెరుగుతుంది. కేవలం 10 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4 గంటల ప్లేబ్యాక్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. వీటికి IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించగా.. ఛార్జింగ్ కేస్‌కు IPX2 రేటింగ్ ఉంది. Nothing X యాప్ ద్వారా ఫైండ్ మై ఇయర్ బడ్స్, ఫర్మ్‌వేర్ అప్డేట్స్, కస్టమ్ కంట్రోల్స్, స్మార్ట్ డయల్ కస్టమైజేషన్ వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. నథింగ్ ఫోన్లలో ChatGPT, నథింగ్ AI న్యూస్ వంటి షార్ట్‌కట్‌లను కూడా అసైన్ చేసుకునే అవకాశం ఉంది.
Introducing Clip Pro.
Clip on. Keep on. pic.twitter.com/2hkH4Is86k— CMF by Nothing (@cmfbynothing) August 4, 2026
CMF Clip Pro ధర అమెరికాలో 99 డాలర్లు (రూ.9,400), యూకేలో 79 పౌండ్లు (రూ.10,100)గా నిర్ణయించారు. డార్క్ గ్రే, లైట్ గ్రే, కోరల్ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఇయర్‌బడ్స్ ఆగస్టు 15 నుంచి అమెరికా, యూకే, జపాన్ మార్కెట్లలో విక్రయాలు ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 15 నుంచి యూరప్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులోకి వస్తాయి. అయితే భారత మార్కెట్లో విడుదల చేయబోమని కంపెనీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!