టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడాడు. టీఆర్ఎస్ పై ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలపై కొద్దికాలంగా మౌనంగా ఉంటున్న మంత్రి కేటీఆర్ ఈరోజు బరస్ట్ అయ్యాడు. టీఆర్ఎస్ ప్లీనరీ సాక్షిగా తన మౌనాన్ని బద్దలు కొట్టారు. తాజాగా జలవిహార్లో జరిగిన టీఆర్ఎస్ విస్తృత స్థాయి ప్లీనరీ సమావేశంలో ప్రత్యర్థులపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘నాన్న.. పందులే గుంపులుగా వస్తాయని.. సింహం సింగిల్ గా వస్తుంద’నే రీతిలో ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశాడు. టీఆర్ఎస్ […]
విద్యాశాఖలో నాడు–నేడు, పౌండేషన్ స్కూళ్లుపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. అందులో సీఎం జగన్ మాట్లాడుతూ… నూతన విద్యావిధానం అమలు పై అన్ని రకాలుగా సిద్ధం కావాలి. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలి అని సూచించారు. కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూళ్ల, టాయిలెట్ల నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద చూపించాలి అని తెలిపారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్ ప్రతి స్కూల్లో ఉంచాలి. […]
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల టైం సమీపిస్తున్న కొద్ది అక్కడ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా అసెంబ్లీ, ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ అధికంగా ఎంపీ సీట్లను కైవసం చేసుకొని కేంద్రంలో ఈజీగా వరుసగా బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగీ సర్కారును దెబ్బకొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. […]
కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే మన దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చి దాదాపు 8 వేళలు అవుతున్న కొంత మంది టీకా తీసుకోవడానికి ఇంకా సంకోచిస్తున్నారు. అయితే టీకాపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమష్టికృషితో కరోనా […]
బీజేపీ రాష్ట్ర కమిటీకి పవర్ లేదు… పవర్ అంతా.. ఢిల్లీ చేతిలోనే అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకోవడానికి తెరాస.. బీజేపీ కుట్రలు చేస్తున్నాయి. గల్లీలో బండి సంజయ్ సీఎం నీ గల్లీలో బండ బూతులు తిడతారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టు.. బండి సంజయ్ ఇప్పటికీ సీఎంని జైల్లో పెడతా అని రెండు వందల అబద్ధాలు అడి ఉంటారు అని తెలిపారు. పులి.. మేక ఆటలో బండి సంజయ్ బలి అయిపోతారు. […]
ఓ పక్క కేసులు తగ్గాయన్న సంతోషం… మరోవైపు థర్డ్ వేవ్ మొదలైందన్న ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం క్రాస్ రోడ్స్‌లో ఉన్నాం. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. అయితే ఇదే సమయంలో దేశంలో థర్డ్ వేవ్ పాదం మోపటం ఓ […]
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ వర్ష ప్రాభావిత 20 జిల్లాల కలెక్టర్లతో నేడు సమీక్ష నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలి. జిల్లాల్లోని అధికారులందరూ కార్యస్థావరంలోనే ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల దాదాపుగా అన్ని చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలో అన్ని […]
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు తాగుతూ వస్తున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 301 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 339 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,59,844 కు చేరగా… రికవరీ కేసులు 6,50,453 కు […]
ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గవ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ చివరి రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసారు. ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ(50), శార్దుల్(57) అర్ధశతకాలు చేయడంతో 191 పరుగులు చేసి మొదటి రోజే ఆల్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆతిథ్య జట్టు 290 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ […]
ఈ కరోనా పాడుగానూ.. ఎప్పుడొచ్చిందో.. ఎలా వచ్చిందో కానీ.. అందరికంటే ఎక్కువగా విద్యార్థులకే నరకం చూపిస్తోంది. కరోనా లాక్ డౌన్ మొదలైంది మొదలు అన్నీ బంద్ పడ్డాయి. అయితే అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉందా? అంటే అవి చదువులే.. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కండ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ప్రస్తుతం పెద్ద […]