అశ్విన్ కాకుమాను హీరోగా హారర్ థ్రిల్లర్ ‘పిజ్జా 3 – ది మమ్మీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సి. వి. కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది హారర్ థ్రిల్లర్ మూవీ ‘పిజ్జా’. విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సి. వి. కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ చిత్రమే ‘పిజ్జా 3’. అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా, డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తున్న ‘పిజ్జా 3 – ది మమ్మీ’లో ‘డైరీ’ ఫేమ్ పవిత్రా మారిముత్తు హీరోయిన్‌గా నటించింది.
ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేయడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. గ్లింప్స్‌లో ప్రతి సీన్, దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే హారర్ థ్రిల్లర్ ఎలా ఉండాలని సగటు ప్రేక్షకుడు భావిస్తాడో దాన్ని మించేలా ఉంది. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్ అంచనాలు మరింత పెరిగడం ఖాయం. గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళి వెంకట్, అనుపమ కుమార్, రవీనా దాహ, కురైసి, యోగి, సుభిక్ష ఇతర కీలక పాత్రలను పోషించారు. ‘పిజ్జా2’ కు సీక్వెల్‌గా ‘పిజ్జా3’ ని ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. 'ఉప్పెన' హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?