2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి.
ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
అన్ని చట్టాల్లోనూ ఏకరూపత అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దేశంలోని చట్టాలన్నిటిలోనూ ఏకరూపత ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను కాంగ్రెస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదు అన్నట్టుగా మారింది దేశ రాజధాని ఢిల్లీలోని వరదల పరిస్థితి. యమునా నది ప్రవాహం కొంత మేరకు తగ్గినప్పటికీ.. వర్షాలు తగ్గకపోవడంతో .. ఢిల్లీ ప్రజలు ఇంకా వరద నీటి నుంచి బయటికి రాలేకపోతున్నారు.
మణిపూర్ లో గత రెండున్నర ఏళ్లుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చేరనుంది. ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్ ప్రకటించారు.
వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు.